telugu navyamedia
Uncategorized రాజకీయ వార్తలు సామాజిక

ఈ నెల 20 నుంచి కొన్నింటికి మినహాయింపులు: లవ్ అగర్వాల్

Janatha carfew AP cader IAS Officer

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ పొడగించినప్పటికీ ఈ నెల 20 నుంచి కొన్నింటికి మినహాయింపులు ఇస్తున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, మండీలకు, అనుమతించనున్నట్టు చెప్పారు. వ్యవసాయ పరికరాలు, విడిభాగాలు విక్రయించే దుకాణాలు, వ్యవసాయ యంత్ర పరికరాలను అద్దెకు ఇచ్చే సంస్థలు, విత్తనోత్పత్తి, ఎరువులు, పురుగుమందుల దుకాణాలు తెరిచేందుకు అనుమతిస్తున్నట్టు తెలిపారు.

వరికోత యంత్రాల రవాణాకు, ఉపాధి హామీ పనులు చేసేందుకు అనుమతిస్తున్నట్టు తెలిపారు. అయితే, ఉపాధి కూలీలు తగు జాగ్రత్తలు పాటించాలని, మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, సాగునీటి పారిశ్రామిక ప్రాజెక్టుల నిర్మాణాలకు అనుమతిస్తున్నామని తెలిపారు.

భవన నిర్మాణ రంగానికి షరతులతో కూడిన అమనుతులు ఇస్తామని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న కూలీలతోనే భనవ నిర్మాణ పనులు చేపట్టాలని ఆదేశించారు. ఇతర ప్రాంతాల నుంచి కూలీలను తరలించేందుకు అనుమతించమని స్పష్టం చేశారు. 50 శాతం సిబ్బందితో ఐటీ సంస్థలు, సేవల నిర్వహణకు, ఈ- కామర్స్ సంస్థలు,  మెకానిక్స్, కార్పెంటర్ల సేవలకు అనుమతిస్తామని తెలిపారు.

Related posts