telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆయన రీల్ హీరో కాదు రియల్ హీరో : వర్మ

varma

సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ పేరు చెబితే చాలు నేరస్థుల గుండెల్లో గుబులు పుడుతుంది. ఇటీవల దిశా నిందితుల ఎన్‌కౌంటర్‌తో దేశ వ్యాప్తంగా సజ్జనార్ పేరు మారుమోగిపోయింది. సాధారణ ప్రజల నుంచి సినీ సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ సజ్జనార్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా మరోసారి వర్మ ఆయనని అభినందించారు. కరోనా వైరస్‌పై అవగాహన కల్పిస్తూ లాక్‌డౌన్‌ను పాటించడం ఎంత అవసరమో తెలియజేస్తూ సైబరాబాద్ పోలీసులు ఒక పాటను విడుదల చేశారు. ‘ఓరి ఓరి నా ఫ్రెండు’ అంటూ సాగే ఈ పాటను సైబరాబాద్ పోలీస్ శాఖలో పనిచేస్తోన్న సబ్ ఇన్‌స్పెక్టర్ లాల్ మధార్ రాశారు. ఈ పాటను మంగళవారం కమిషనర్ సజ్జనార్ విడుదల చేశారు. అంతేకాదు, యూబ్యూట్‌లో అప్‌లోడ్ చేసిన ఈ పాటను సైబరాబాద్ పోలీస్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రమోట్ చేశారు. ఈ ట్వీట్‌కు ఆర్జీవీ స్పందించారు. ‘‘కరోనా వైరస్‌ను ఎన్‌కౌంటర్ చేయాలని, లాక్‌డౌన్‌పై ఫ్రెండ్లీ సబ్ ఇన్‌స్పెక్టర్ లాల్ మధార్ ‘నా ఫ్రెండ్’ అనే సూపర్ సాంగ్ రాశారు. ఈ పాటను ఎవరో సినిమా రీల్ హీరో విడుదల చేయలేదు. నిజంగా రియల్ హీరో, ది గ్రేట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సజ్జనార్ విడుదల చేశారు. కచ్చితంగా వినాల్సిన, షేర్ చేయాల్సిన పాట’’ అని ఆర్జీవీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Related posts