విశాఖ ఉక్కు కర్మాగారం ప్రయివేటీకరణ విషయంలో కేంద్రం వైఖరికి నిరసనగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారుస్టీల్ ప్లాంట్ కార్మికులు. పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం కాపీలు దగ్ధం చేశారు కార్మికులు, అలానే మోడీ వ్యతిరేక నినాదాలు చేస్తూన్నారు. కూర్మన్నపాలెం మెయిన్ గేట్ దగ్గర రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఒక రకంగా ఉక్కు కార్మికులు జాతీయ రహదారిని దిగ్భందం చేసినట్టయింది. మరో పక్క ఉక్కు పరిరక్షణ శిబిరం దగ్గరకు భారీ ఎత్తున కార్మికులు చేరుకుంటున్నారు. ఉక్కు కార్మికుల ఆందోళన ఉధృతం అయి, జాతీయ రహదారిపై మంటలు వేసి నిరసన తెలియజేస్తున్నారు. మరికొన్ని చోట్ల రోడ్డుపై పడుకుని వాహనాలను అడ్డుకుంటున్నారు ఆందోళనకారులు. భారీగా ట్రాఫిక్ జామ్ తో ప్రయాణికులకు ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ ఆంధులనలో భాగంగా నేడు స్టీల్ ప్లాంట్ పరిపాలన భవనం ముట్టడించనున్నారు కార్మికులు. చూడాలి మరి ఈ విషయం లో ఇంకా ఏం జరుగుతుంది అనేది.
previous post
next post
చంద్రబాబు ట్రంప్ తోనైనా పొత్తు పెట్టుకోగలరు: మంత్రి అనిల్