telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేటీఆర్ ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ సీఎం కాలేడు: లక్ష్మణ్

BJPpresident -K-Laxman

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ మంత్రి కేటీఆర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాదులో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ సీఎం కాలేడని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు.

రాహుల్ గాంధీ విషయంలో సోనియా చేసిన తప్పును కేసీఆర్ చేయదల్చుకోలేదని అన్నారు. అందుకే పురపాలక ఎన్నికలు పూర్తయిన తర్వాత కేటీఆర్ పట్టాభిషేకానికి ముహూర్తం నిశ్చయించారని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వెనుక ప్రభుత్వం, ఎన్నికల సంఘం కుట్ర ఉందని అన్నారు.

Related posts