telugu navyamedia
క్రీడలు వార్తలు

వెళ్లేముందు స్టోక్స్ కు అధ్బతమైన గిఫ్ట్ ఇచ్చిన రాయల్స్…

పంజాబ్ కింగ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ ఫీల్డింగ్ చేస్తూ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్ క్యాచ్ అందుకునే క్రమంలో స్టోక్స్ ఎడమ చేతి వేలికి గాయమైంది. మ్యాచ్ అనంతరం పరీక్షలు చేయగా.. అతని చూపుడు వేలు విరిగినట్లు తేలడంతో డాక్టర్లు సర్జరీ చేయాలని సూచించారు. దాంతో అతను స్వదేశానికి బయల్దేరిపోయాడు. శుక్రవారం రాత్రే ఇంగ్లండ్‌కు బయల్దేరాడు. అయితే రాజస్థాన్‌ రాయల్స్ జట్టును వీడి వెళ్లడానికి స్టోక్స్ అస్సలు ఇష్టపడలేదని, సర్జరీ అనివార్యం కావడంతో అతను బలవంతంగా ఇంగ్లండ్‌కు పంపించారని రాజస్థాన్ టీమ్ అధికారి ఒకరు తెలిపారు. ఇక జట్టును వీడేందుకు సిద్దమైన స్టోక్స్‌కు రాజస్థాన్ రాయల్స్ మంచి బహుమతిచ్చింది. ఇటీవల మరణించిన అతని తండ్రి జెడ్ స్టోక్స్ పేరిట జెర్సీని రూపొందించి ఇచ్చింది. ఇక స్టోక్స్ త్వరగా కోలుకోవాలని రాజస్థాన్ రాయల్స్ టీమ్ ట్వీట్ చేసింది.

Related posts