telugu navyamedia
రాజకీయ వార్తలు

కరోనా పేషెంట్ ఆత్మ‌హ‌త్య‌… ఎందుకంటే…?

suicide

మ‌హారాష్ట్ర‌లోని పుణెలో వార్జె మాల్వాడీ ప్రాంతంలోని హాస్పిట‌ల్ లో దారుణ ఘటన జరిగింది. హాస్పిట‌ల్ లో బెడ్స్ ఖాళీ లేవని డాక్టర్లు చెప్పినందుకు ఓ మహిళా ఆత్మహత్య చేసుకుంది. అయితే ఏప్రిల్ 2న ఆమెకు కొవిడ్ ల‌క్ష‌ణాలు కనిపించటంతో.. అప్పటినుంచి 8వ తేదీ వరకు ఆమెకు ఆ ఆసుప‌త్రిలో చికిత్స అందించారు. నాలుగు రోజుల తర్వాత డిశ్చార్జ్ చేశారు. అయితే అదే రోజు రాత్రి తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురి కావ‌డంతో మ‌రుస‌టి రోజు అదే ఆసుప‌త్రికి తీసుకెళ్లారు. అయితే బెడ్స్ లేవంటూ ఆమెను చేర్చుకోలేదు అని ఆమె భ‌ర్త తెలిపాడు. దీంతో త‌న భార్య ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన‌ట్లు అత‌డు తెలిపాడు.  అయితే స‌ద‌రు ఆసుప‌త్రి యాజమాన్యం మాత్రం ఈ ఆరోప‌ణ‌లు ఖండించింది. ఆమెకు క‌రోనా చికిత్స చేసిన త‌ర్వాత డిశ్చార్జ్ చేసిన‌ట్లు చెప్పింది. ఆమె పూర్తిగా కోలుకున్న‌ద‌ని చెప్పుతుంది. ఆమె ఆత్మ‌హ‌త్య‌కు గల కారణాలు తమకు తెలియవని యాజమాన్యం చెపుతుంది.

Related posts