telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

షర్మిలకు మాజీ హోంమంత్రి మద్దతు…

వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్న విషయం తెలిసిందే. అందుకే ఆత్మీయ సమ్మేళనాల పేరుతో వైఎస్సార్‌ అభిమానులతో సమావేశమవుతున్నారు. అయితే షర్మిల తొలి సమావేశం నిర్వహించిన రోజు నుంచే.. ఆమెపై విమర్శల దాడి ప్రారంభమైంది. తెలంగాణ రాజకీయాల్లో పక్కరాష్ట్రాల వారి అవసరం లేదని అధికారపార్టీ నేతలు వ్యాఖ్యలు చేశారు. అయితే ఎంతలా విమర్శలు ఎదురవుతున్నాయో అంతలా ఆమెకు మద్దతు కూడా లభిస్తోంది. తాజాగా షర్మిలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ హోంమంత్రి కే.ప్రభాకర్ రెడ్డి మద్దతు తెలిపారు. అంజయ్య క్యాబినెట్ లో హోం మంత్రి గా పని చేసిన ప్రభాకర్ రెడ్డి రాజశేఖర్ రెడ్డికి తర్వాత కాలంలో అప్తుడిగా మారారు. ఇప్పుడు ఆయన షర్మిలకు మద్దతు పలికినట్టు చెబుతున్నారు. షర్మిల ప్రస్తుతం తెలంగాణలోని ఉమ్మడి జిల్లాలవారీగా ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానని షర్మిల అంటున్నారు. దీంతో పాటు వైఎస్సార్ ఆత్మీయ సమ్మేళనంలో అభిమానుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకునుంటున్నారు. చూడాలి మరి ఆవిడ పార్టీ ఎప్పుడు ప్రారంభిస్తారు అనేది.

Related posts