telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

నేను టెస్ట్ మ్యాచ్ లకే పరిమితం కాదు.. అన్ని ఫార్మట్లలో ఆడగలను .. : హనుమ విహారి

hanuma vihari on his training for

మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ హనుమ విహారి తాను ఒక్క టెస్టు మ్యాచ్‌లకే పరిమితం కదలుచోవట్లేదని, అన్ని ఫార్మాట్లలో క్రికెట్‌ ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నాడు. గత 15 రోజులుగా తాను బెంగళూరు జాతీయ క్రికెట్‌ అకాడమీలో శిక్షణ పొందానని, దక్షిణాఫ్రికాపై బాగా ఆడేందుకు కష్టపడ్డానని చెప్పాడు. గత పర్యటనలో వెస్టిండీస్‌పై తొలి శతకం బాదిన విహారి ఇప్పుడు దక్షిణాఫ్రికాపై సొంత అసోసియేషన్‌ మైదానంలో తొలిసారి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడనున్నాడు. భారత్‌లో తొలిసారి దేశం కోసం అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడుతున్నా. అది కూడా విశాఖపట్నంలో, నా సొంత క్రికెట్‌ అసోసియేషన్‌లో ఆడటం చాలా ఉత్తేజాన్ని కలిగిస్తోంది.

ఈ మ్యాచ్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని పేర్కొన్నాడు. అలాగే తాను తొలి అంతర్జాతీయ శతకం బాదినప్పుడు డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌.శ్రీధర్‌ ఉండటం తనకు సంతోషాన్ని కలిగించిందని చెప్పాడు. శ్రీధర్‌ తనకు ఎన్నో ఏళ్ల నుంచి శిక్షణ ఇచ్చాడని, తన కెరీర్‌లో అతడి పాత్ర ఎంతో కీలకమని చెప్పాడు. తొలి శతకం బాదిన వేళ డ్రెస్సింగ్‌రూమ్‌లో అతను ఎలా భావోద్వేగం చెందాడో తాను ఊహించుకోగలనని, అది తనకెంతో ప్రత్యేకమైన రోజని విహారి చెప్పుకొచ్చాడు. వచ్చే నెల 2 నుంచి టీమిండియా దక్షిణాఫ్రికాతో విశాఖలో తొలి టెస్టు ఆడనున్న విషయం తెలిసిందే.

Related posts