రాహుల్‌తో ప్రేమలో ఉన్నానని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం. మా గురించి బయట వేరేలా మాట్లాడుకోవడం చూసి చాలా బాధేసింది’ అంటోంది పునర్నవి. ఈమె బిగ్ బాస్ 3 కంటెస్ట్ అనే సంగతి తెలిసిందే. ఇటీవలే ఈమె హౌస్ నుంచి బయటకొచ్చింది. ఈ సందర్భంగా ఆమె పలు వ్యాఖ్యలు చేసింది. రాహుల్ నా బెస్ట్ ఫ్రెండ్. బయటి ప్రపంచం తమ మధ్య తమ ఫ్రెండ్ షిప్‌ను ఎలా చూస్తుందోనని వర్రీ అయ్యేదానిని అని తెలిపింది. దాని గురించి పెద్దగా పట్టించుకోవద్దని అర్థం చేసుకున్నట్లు, ఎంత కొట్టుకున్నా..ఎంత తిట్టుకున్నా..తాము మంచి మిత్రులమని మరోసారి వెల్లడించింది.
బిగ్ బాస్ హౌస్‌లో కొన్ని వారాలు రాహుల్‌తో అంతగా కంఫర్టబుల్‌గా లేనని, అందుకే అతన్ని తిట్టేదానిని అని తెలిపింది. బిగ్ బాస్ 3లో లేడీ మోనార్క్‌గా పేరు తెచ్చుకుంది పునర్నవి. గత వారం ఎలిమినేట్ అయ్యింది. పునర్నవి ఎలిమినేట్ అయ్యిందని నాగార్జున ప్రకటించగానే..హిమజ టీవీ ముందుకు వచ్చి స్పెప్పులేశారు. ఈమె తెనాలిలో పుట్టారు. హైదరాబాద్‌లో విద్యాభ్యాసం చేశారు. చదువులో ఉండగానే ఉయ్యాల..జంపాల సినిమాలో నటించే అవకాశం వచ్చిందన్నారు. బిగ్ బాస్ 2 సీజన్ అవకాశం వచ్చినా..కుదరలేదని తెలిపింది. కథలు వస్తున్నాయని, ప్రస్తుతం యాక్టింగ్, చదువుపైనే దృష్టి కేంద్రీకరించినట్లు తెలిపింది.