telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాక్స్ ఆఫీస్ వద్ద.. కొత్త రికార్డుల మోత మోగిస్తున్న .. జెర్సీ ..

jersi new look on nani birthday

జెర్సీ తో నేచురల్ స్టార్ నాని బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. గత ఏడాది రెండు ప్లాపులతో నిరాశ పరిచినప్పటికీ ఈ ఏడాదిలో జెర్సీ తో భారీ సక్సెస్ అందుకొని అభిమానులను ఆనందంలో నింపాడు. గౌతమ్ డైరెక్షన్లో నాని – శ్రీనాధ్ జంటగా సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ మూవీ క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడం లో సక్సెస్ సాధించడం తో బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురుస్తుంది. ముఖ్యంగా మరోసారి ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర నాని సత్తా చాటుతున్నాడు. శనివారం రోజున 107,389 డాలర్లు వసూలు చేసిన ఈ చిత్రం మొత్తంగా 514,800 డాలర్లతో హాఫ్ మిలియన్ క్రాస్ చేసింది. ఇంకో మూడు రోజుల్లో చిత్రం మిలియన్ డాలర్ మార్కును అందుకోనుందని తెలుస్తుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మించిన ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించాడు.

Related posts