telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

మళ్ళీ … వెంకీ, వినాయక్ కాంబో ..

venkatesh and vinayak combo movie

విక్టరీ వెంకటేష్ ఎఫ్ 2 మూవీ తరువాత మళ్ళీ జోరు పెంచారు. ఇపుడు సొంత మేనల్లుడు నాగ చైతన్యతో వెంకీ మామ మూవీ చేస్తున్నారు. ఆ మూవీ దాదాపుగా పూర్తి కావచ్చింది. సంక్రాంతికి పందెం కోడిగా దింపాలనుకుంటున్నారుట. ఇక వెంకీ తరువాత ప్రాజెక్టులు ఏంటి అని చూస్తే చాలా ఆసక్తికరమైన న్యూస్ వస్తోంది. ఆయన వెంటనే తరుణ్ భాస్కర్ అనే డైరెక్టర్ తో కొత్త మూవీని పట్టాలెక్కించే పనిలో ఉన్నారట. తరుణ్ మూవీ కంప్లీట్ కాగానే మాస్ మసాలా డైరెక్టర్ వీవీ వినాయక్ డైరెక్షన్లో వెంకీ మూవీ ఉంటుందని తెలుస్తోంది. . దీనికి సంబంధించి వినాయక్ చెప్పిన లైన్ వెంకీకి నచ్చెసిందట. దాంతో చేద్దామని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట.

వెంకీ, వినాయక్ కాంబోలో పన్నెండేళ్ళ క్రితం లక్ష్మీ మూవీ వచ్చింది. సంక్రాంతికి రిలీజ్ అయిన ఆ మూవీ అప్పట్లో సూపర్ సక్సెస్ అయింది. వెంకీని ఇటు ఫ్యామిలీ మ్యాన్ గా అటు, యాక్షన్ హీరోగా చూపించడం ద్వారా వినాయక్ అప్పట్లో సక్సెస్ అయ్యాడు. ఇపుడు దాదాపు అలాంటి కధతోనే వినాయక్ మూవీ ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం వినాయక్ తానే హీరోగా శీనయ్య మూవీ చేస్తున్నారు. ఆ బిజీ నుంచి పూర్తి కాగనే వెంకీ మూవీ మీద కూర్చుంటారని అంటున్నారు వెంకీ సైతం తరుణ్ భాస్కర్ మూవీ తరువాత వచ్చే ఏడాది సమ్మర్ తరువాత వినాయక్ తో మూవీ చేస్తారని వినిపిస్తోంది. 2021 సంక్రాంతి టార్గెట్ గా ఈ మూవీ వస్తుందని, మళ్ళీ బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుందని అంటున్నారు. మరి వెంకీ వినాయక్ ఎలా టాప్ రేపుతారో, ఎన్ని రికార్డులు బద్దలు కొడతారో చూడాలి.

Related posts