telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

మార్చి 2నుంచి పురపాలక ఎన్నికల ప్రక్రియ…

Nimmagadda ramesh

పంచాయితీ ఎన్నికల కంటే ముందు ఎంపీటీసీ ,జడ్పీటీసీ ఎన్నికలు  జరపాలని ముందుగా భావించాం అని ఎస్ఈసీ నిమ్మగడ్డ అన్నారు. కానీ న్యాయ స్థానాల్లో కేసుల కారణంగా ఈ ఎన్నికలకు  కొన్ని అవాంతరాలు ఉన్నాయి. అవరోధాలు తొలగిపోయిన అనంతరం ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు. మార్చి 2నుంచి పురపాలక ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది. పట్టణ ఓటర్లు కూడా పెద్దఎత్తున ఓటింగులో పాల్గొనాలి. వీలైనంత ఎక్కువగా పోలింగ్ కేంద్రాలు,సదుపాయాలు కల్పిస్తాం. వీడియో కాన్ఫరెన్సులో ఒత్తిళ్ల వల్ల గతంలో  నామినేషన్ల ఉపసంహరించుకున్న వారి విజ్ణప్తులపై చర్చిస్తాం అని తెలిపారు. ఇక పురపాలికల్లో నామినేషన్లు వేయలేక పోయిన వారు రుజువులతో సహా ఫిర్యాదు చేస్తే నామినేషన్ వేసే అవకాశం కల్పిస్తాం. అందరి హక్కులను కాపాడే బాధ్యత ఎస్ఈసీపై ఉంది. పురపాలిక ల్లో నామినేషన్ల ఫిర్యాదుల స్వీకరణ అంశాన్ని సంబంధించి  23లోపు ఈ ప్రక్రియను పూర్తి చేస్తాం. పట్టణ ప్రాంతాల్లో జరిగే ఎన్నికలనూ నిర్విజ్నంగా నిర్వహిస్తాం. పురపాలక ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలి. నాలుగు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికలు జయప్రదంగా ముగిశాయి అవాంఛనీయ ఘటనల వల్ల ఒక్కచోట కూడా తిరిగి పోలింగ్ జరగలేదు ఎక్కడా ఎన్నికలు వాయిదా పడలేదు. రాజకీయ వర్గాలు, ఓటర్లు విజ్ణతతో వ్యవహరించారు అని పేర్కొన్నారు.

Related posts