కరోనా సమస్యతో థియేటర్లు మూసివేసిన విషయం తెలిసిందే. ఓటీటీ వేదికగా చిత్రాలను విడుదల చేయడానికి పలువురు నిర్మాతలు మొగ్గు చూపుతున్నారు. లాక్‌డౌన్‌లో ఓటీటీలకు మంచి ప్రాధాన్యత లభించింది. థియేటర్లు ప్రారంభం అయినప్పటికీ ఓటీటీల ప్రాధాన్యం ఏ మాత్రం తగ్గలేదు. పెద్ద సినిమాలు మినహా.. చిన్న సినిమాలు మొత్తం తమకు ఓటీటీనే బెటర్ అని భావిస్తున్నాయి. ఓటీటీ అయితే.. తమ సినిమాకు ప్రేక్షకుల ఆదరణ బాగా లభిస్తుందని నిర్మాతలు కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఓటీటీ సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ఫ్రైమ్ లాంటి ఓటీటీ సంస్థలు స్వీయ నియంత్రణ నిబంధనలు రూపొందించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. సెన్సార్ బోర్డ్, టీవీ న్యూస్ ఛానల్స్ లాంటి సంస్థలు రూపొందించుకున్నట్లుగా ఓటీటీలు కూడా స్వీయ నియంత్రణ కలిగి ఉండాలని స్పష్టం చేసింది. ఓటీటీలో ప్రదర్శించే చిత్రం లేదా సిరీస్‌ను పర్యవేక్షించుకోవాలని సందరు సంస్థలకు తెలిపింది. తద్వారా ప్రభుత్వం ఈ అంశంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉండదని పేర్కొంది.
previous post