telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

భర్తతో గొప్ప సాహసయాత్రకు సిద్ధమవుతున్న సమంత… గంటల్లోనే 10 లక్షల లైక్స్

Sam

దేశమంతా లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలో సెలబ్రిటీలతో సహా సామాన్యులంతా ఇళ్ళకే పరిమితమయ్యారు. దీంతో సెలబ్రిటీలు సోషల్ మీడియాలో పలు ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉండే సినీనటి అక్కినేని సమంత, తన ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన ఓ చిత్రం తెగ వైరల్ అయింది. గంటల వ్యవధిలో ఈ ఫొటోకు 10 లక్షలకు పైగా లైక్స్ రావడం గమనార్హం. ఓ పాత ఫొటోకు సమంత యునీక్ గా క్యాప్షన్ తగిలించడమే దీన్ని వైరల్ చేసింది. “ఓ గొప్ప సాహసయాత్రకు మేము సిద్ధమవుతున్నాం… దాదాపుగా…” అంటూ డ్రైవింగ్ సీటులో నాగ చైతన్య, పక్కన సమంత, ఆమె చేతిలో వారి పెంపుడు కుక్క ఉన్న ఫొటోను షేర్ చేసుకుంది. ఇక ఈ ఫొటోకు వందల సంఖ్యలో కామెంట్లు వచ్చి పడుతున్నాయి. ప్రస్తుతం చైతూ ‘లవ్ స్టోరీ’ సినిమాతో బిజీగా ఉండగా, లాక్ డౌన్ తొలగించగానే షూటింగ్ ప్రారంభం కానుంది. సమంత కూడా పలు చిత్రాలతో బిజీగా ఉంది.

 

View this post on Instagram

 

Going on a grand adventure…………almost…… 🤷‍♀️ #tbt

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on

Related posts