telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రానా దగ్గుబాటి ఫుల్ క్లారిటీ… అనారోగ్యంపై వస్తున్న వార్తలకు చెక్

Rana

బాహుబ‌లి చిత్రంలో భ‌ళ్ళాల‌దేవ పాత్ర‌తో దేశవ్యాప్తంగా అశేష అభిమానులను సంపాదించుకున్న రానా ద‌గ్గుబాటి తెలుగులో “విరాట ప‌ర్వం” అనే సినిమాతో రానా బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే. మరోవైపు హౌస్‌ఫుల్ ఫ్రాంచైజ్‌లో భాగంగా తెరకెక్కుతున్న “హౌస్‌ఫుల్-4” చిత్రంలో పవర్ ఫుల్ పాత్రతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మరో వైపున తమిళ, హిందీ సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. రానా ఇప్పుడు తెలుగులో “విరాటపర్వం”, “హిరణ్యకశ్యప”తో పాటు హిందీలో “హాథీ మేరే సాథీ” సినిమాల్లో నటిస్తున్నారు. యాడ్స్ లోను నటిస్తున్నాడు. రానా ఏదో అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడనే ప్రచారం జరిగింది. ఆయన ఆరోగ్యంపై కొన్ని రోజులుగా ఏవేవో వార్తలు వస్తూనే ఉన్నాయి. వాటిపై ఎవరూ క్లారిటీ ఇవ్వడం లేదు. మొన్నటికి మొన్న సురేష్ బాబు మాత్రం తన కొడుకుకి ఏం కాలేదని.. కేవలం కంటి సమస్య మాత్రమే ఉందని కన్ఫర్మ్ చేసాడు. దానికి తోడు కొన్ని రోజులుగా రానా ఇండియాలో లేకపోవడం లేనిపోని అనుమానాలకు తావిచ్చింది. ఈ మధ్యే మళ్లీ ఇండియాకు వచ్చాడు రానా దగ్గుబాటి. వచ్చిన వెంటనే ముంబైలోనే కొన్ని రోజులు ఉన్నాడు. ఈ మధ్యే రాజమౌళి అండ్ టీంతో కలిసి బాహుబలి ప్రివ్యూ షో కోసం జపాన్, లండన్ వెళ్లాడు. ఇప్పుడు తనపై వస్తున్న వార్తలపై రానా క్లారిటీ ఇచ్చాడు. మొన్నటికి మొన్న తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో అభిమానులతో అనారోగ్యం వార్తలపై స్పందించాడు రానా. కార్‌లో ఉన్న ఓ ఫోటోను షేర్ చేసి.. ఆల్రైట్.. ఆన్‌లైన్‌లోకి లోకి వచ్చాను.. మరికొన్ని గంటల్లో ఇండియాలో వస్తున్నానంటూ పోస్ట్ చేసాడు. ఇక ఇప్పుడు తన ట్విట్టర్లో మరో సంచలన పోస్ట్ పెట్టాడు. తన గురించి తాను కాకుండా వేరే ఎవరూ పోస్ట్ చేసినా.. వార్తలు రాసినా అది అబద్ధమే అని క్లారిటీ ఇచ్చాడు రానా. దాంతో రానా అనారోగ్యంపై వస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్ పడ్డట్లే అనిపిస్తుంది.

Related posts