ఏపీలో తాజాగా కురిసిన భారీ వర్షాలు, వరదలకు రాయలసీమలోని నాలుగు జిల్లాలతో పాటు జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అక్కడి స్థానిక ప్రజలు భారీ వర్షాలతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
పలు ప్రాంతాలలో గ్రామాలకు గ్రామాలే వరదలో మునిగిపోగా.. భారీగా పంటలు, పాడి పరిశ్రమ దెబ్బతింది. రాష్ట్రవ్యాప్తంగా వందల ఎకరాల పంటనష్టంతో పాటు వ్యక్తిగతంగా కూడా ఆస్తుల నష్టం కలిగింది. దీంతో వరద బాధితులకు టాలీవుడ్ హీరోలు ఇవాళ వరుసగా సాయం ప్రకటించారు.
ఏపీలో వర్షాలు, వరద బీభత్సానికి నష్టపోయిన బాధితులకు మెగాస్టార్ చిరంజీవి అండగా నిలిచారు. బాధితులను ఆదుకునేందుకు తనవంతు సాయంగా 25 లక్షల రూపాయలను ఏపీ ప్రభుత్వ సహయనిధికి విరాళంగా ప్రకటించారు. అనంతరం చిరంజీవి బాటలోనే ఆయన తనయుడు రామ్ చరణ్ కూడా బాధితులను ఆదుకునేందుకు తన వంతు సాయంగా 25 లక్షల రూపాయలను ఏపీ ప్రభుత్వ సహాయ నిధికి విరాళంగా ప్రకటించారు. చిరంజీవి, రామ్ చరణ్ ల నుండి ఏపీ ప్రభుత్వ సహాయ నిధి కి మొత్తం 50 లక్షల రూపాయలు విరాళం అందినట్లయింది. ఏ విపత్తు వచ్చినా బాధితులకు అండగా ఉండేందుకు మెగా ఫ్యామిలీ ముందు ఉంటుందనేది మరోసారి నిరూపించారని అభిమానులు చెప్తున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ వరద విపత్తు బాధితుల సహాయానికి రూ.25 లక్షలు ఇస్తున్నట్టు ప్రకటించాడు. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల సంభవించిన వరదల వల్ల ప్రభావితమైన ప్రజల కష్టాలను చూసి చలించి, వారు కోలుకోవడానికి ఒక చిన్న సాయంగా నేను 25 లక్షల రూపాయలను అందిస్తున్నానని జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. బాధితులు వరద ముప్పు నుంచి త్వరగా కోలుకోవాలని ఎన్టీఆర్ ఆకాంక్షించాడు.
సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఏపి వరద బాధితుల సహాయార్ధం 25 లక్షల రూపాయలు సాయంగా ప్రకటించాడు. ఆంధ్రప్రదేశ్‌లో వినాశకరమైన వరదల దృష్ట్యా, నేను సిఎంఆర్ఎఫ్ కి 25 లక్షలు అందించాలనుకుంటున్నాను. ఈ సంక్షోభ సమయంలో అందరూ ముందుకు వచ్చి ఏపీకి సహాయం చేయాలని అభ్యర్థిస్తున్నానని మహేష్ ట్వీట్ చేశాడు.
మూవీ మాఫియా “మణికర్ణిక”ను చంపాలనుకుంది… కంగనా సంచలన వ్యాఖ్యలు