telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘118’ నుండి లిరికాల్ సాంగ్.. ‘చందమామ చేతికందిందంటున్న’ కళ్యాణ్ రామ్..

lyrical song from 118 movie

కళ్యాణ్ రామ్ చిత్రం 118 చిత్రం నుండి లిరికాల్ సాంగ్ విడుదల చేశారు. గుహన్ దర్శకత్వంలో వెళ్తున్న ఈ చిత్రం విభిన్నమైన కథాకథనాలతో నిర్మితమవుతోంది. ఈ సినిమాలో, నివేదా థామస్ .. షాలినీ పాండే కథానాయికలుగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి కల్యాణ్ రామ్ – షాలినీ పాండే కాంబినేషన్లోని ఫస్టు సింగిల్ ను రిలీజ్ చేశారు.

“చందమామే చేతికందే .. వెన్నెలేమో మబ్బులోనే .., పూల చెట్టే కళ్లముందే .. పూవులేమో కొమ్మపైనే .., చూస్తూనే ఎంతసేపు .. తాకితేనే ఏంటి తప్పు .. పాతికేళ్ల బ్రహ్మచారి బాధ చూడవా .. “అంటూ ఈ సాంగ్ సాగుతోంది. శేఖర్ చంద్ర సంగీతం .. రామాంజనేయులు సాహిత్యం .. యాజిన్ నిజర్ ఆలాపన యూత్ ను ఆకట్టుకునేలా వున్నాయి. ఈ సినిమాలో కల్యాణ్ రామ్ కొత్తగా కనిపిస్తున్నాడు. ఈ సినిమాతో తనకి తప్పకుండా హిట్ పడుతుందనే నమ్మకంతో ఉన్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా నిలబెడుతుందేమో చూడాలి.

Related posts