telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఏపీలో రూ. 5లకే సినిమా..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సినిమా టిక్కెట్ల అమ్మకం విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం పంతం నెగ్గించుకుంది. సినిమా పరిశ్రమను తన గుప్పెట్లోకి తీసుకుంది. సినిమా థియేటర్లలో వసూలు చేసే టిక్కెట్ల ధరలను నగరం, మునిసిపాలిటీ, గ్రామీణ ప్రాంతాలవారీగా నిర్ణయిం చింది. కేటగిరీలో వారిగా నిర్ణయించిన ధరలను ప్రకటించింది. మొత్తం నాలుగు కేటగిరీలుగా విభజించి ధరలను నిర్ణయించింది. ఈ ధరలో అత్యల్పంగా రూ.5 ఉండగా, గరిష్టంగా రూ.250గా నిర్ణయించారు.

సినిమా టిక్కెట్లు ధరలు ప్రకటించడంతో సినిమా వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆన్ లైన్ టికెటింగ్‌ విధానాన్ని ఉద్దేశించి ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఆన్‌లైన్‌ విధానం వల్ల దోపిడీ ఆగిపోతుందనడం సరికాదని ప్రకటనలో పేర్కొన్నారు.

ఇకపై ఏపీ రాష్ట్రంలో బెనిఫిట్ షోలు, ఫ్యాన్స్ షోలకు అనుమతి లేదని ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఛారిటీ సంస్థల నిధుల సేకరణ కోసం ప్రదర్శించే షోలకు మాత్రం అనుమతిచ్చేందుకు జగన్ సర్కారు సమ్మతించింది.

AP CM Jagan Mohan Reddy inspects model houses built for poor, likely to take a final call on model

సర్కారు ప్రకటించిన ఈ టక్కెట్ల వివరాలను పరిశీలిస్తే…

గ్రామీణ ప్రాంతాల్లో సినిమా టిక్కెట్ల ధరలు

మల్టీప్లెక్స్ : ప్రీమియం రూ.80లు, డీలక్స్ రూ.50లు, ఎకానమీ రూ.30లు.

ఏసీ : ప్రీమియం రూ.20, డీలక్స్ రూ.15, ఎకానమీ రూ.10

నాన్ ఏసీ : ప్రీమియం రూ.15లు, డీలక్స్ రూ.10లు, ఎకానమీ రూ.5లు

నగర పంచాయతీలో టిక్కెట్టు ధరలు

మల్టీప్లెక్స్.. ప్రీమియం రూ.120లు, డీలక్స్ 80లు, ఎకానమీ రూ.40లు

ఏసీ: ప్రీమియం రూ.35లు, డీలక్స్ రూ.25లు, ఎకానమీ రూ.15లు

నాన్ ఏసీ : ప్రీమియం రూ.25లు, డీలక్స్ రూ.15లు, ఎకానమీ రూ.10లు

మున్సిపాలిటీ ప్రాంతాల్లో టిక్కెట్టు రేట్లు

మల్టీప్లెక్స్ : ప్రీమియం రూ.150లు, డీలక్స్ రూ.100లు, ఎకానమీ రూ.60లు.

ఏసీ: ప్రీమియం రూ.70లు, డీలక్స్ రూ.50లు, ఎకానమీ రూ.30లు.

నాన్ ఏసీ: ప్రీమియం రూ.50లు, డీలక్స్ రూ.30లు, ఎకానమీ రూ.15లు.

మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాల్లో ధరలు

మల్టీప్లెక్స్‌లలో ప్రీమియం ధర రూ.250లు, డీలక్స్ రూ.150లు, ఎకానమీ రూ.75లు

ఏసీ : ప్రీమియం రూ.100లు, డీలక్స్ రూ.60లు, ఎకానమీ రూ.40లు

నాన్ ఏసీ : ప్రీమియం ధర రూ.60లు, డీలక్స్ రూ.40లు, ఎకానమీ రూ.20లుగా నిర్ణయించింది.

Related posts