telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

తలసరి ఆదాయం జాతీయ సగటు కంటే ఎక్కువ .. టీడీపీ వల్లనే .. : చంద్రబాబు

chandrababu

ఏపీ ప్రభుత్వ బడ్జెట్ పై చంద్రబాబునాయుడు స్పందించారు. 2014లో ప్రజల తలసరి ఆదాయం జాతీయ సగటు కంటే రూ.6 వేలే ఎక్కువ అని, ఇప్పుడది రూ.38 వేలను మించిపోయిందని, ఈ ఘనత టీడీపీ ప్రభుత్వానిది కాదా? అని ప్రశ్నించారు. వైసీపీ నేతలు చెప్పే మాటలు ఒకలా ఉంటాయని, చేతలు మరోలా ఉంటాయని విమర్శించారు. అందుకు బడ్జెట్ కేటాయింపులే నిదర్శనం అని వ్యాఖ్యానించారు. శ్వేతపత్రంలో ఒక రకంగా చెప్పి, బడ్జెట్ లో మరో రకంగా పేర్కొనడం వైసీపీ ప్రభుత్వానికే చెల్లిందని ఎద్దేవా చేశారు.

సున్నా వడ్డీ రుణాలు ఇస్తున్నాం అని చెప్పుకుంటూ అసలు కావాల్సింది రూ.4000 కోట్లు అవసరమైతే, రూ.100 కోట్లు మాత్రమే ఇచ్చారని ఆరోపించారు. పైగా ప్రగతికి ఎంతో ముఖ్యమైన ప్రాజక్టుల కేటాయింపుల్లో 22 శాతం కోత పెట్టడం దారుణమని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. సొంత రాష్ట్రం ప్రజల ప్రయోజనాలను పట్టించుకోకుండా పొరుగురాష్ట్రంలో నీళ్లు పారించేందుకే ఉత్సాహం చూపిస్తున్నారని విమర్శించారు. ఇది ముందుచూపులేని బడ్జెట్ అని విపక్ష నేత అసంతృప్తి వ్యక్తం చేశారు.

Related posts