*మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్‌ను ప్రారంభించిన సీఎం జగన్
*సంగం బ్యారేజీ ని ప్రారంభించి పూజలు చేసిన సీఎం జగన్
ఎన్నో దశాబ్దాల సింహపురి వాసుల కల ఇవాళ్టితో నెరవేరింది .నెల్లూరు జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా మంగళవారం మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్‌ను ప్రారంభించారు.
వేదపండితుల ఆశీర్వచనాల మధ్య సీఎం జగన్ కొబ్బరికాయ కొట్టి బ్యారేజ్‌ను ప్రారంభించారు. అనంతరం పెన్నా నదికి హారతినిచ్చారు. అనంతరం వీటిని జాతికి అంకితమిచ్చారు.
అనంతరం సీఎం జగన్… బ్యారేజ్ వద్ద ఏర్పాటు చేసిన దివంగత వైఎస్సార్, మేకపాటి గౌతమ్‌రెడ్డిల విగ్రహాలను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో మేకపాటి కుటుంబ సభ్యులు, జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అధికారులు పాల్గొన్నారు.