ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మూడు రాజధానుల ప్రతిపాదన వచ్చినప్పటి నుంచి పలు రూపాల్లో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ రైతులు ర్యాలీలు, ధర్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ సుజనా చౌదరి స్పందించారు.
ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతి నుంచి రాజధానిని ఒక్క అంగుళం కూడా కదలించలేరన్నది తన వ్యక్తిగత అభిప్రాయమనిఅన్నారు. రాజధాని విషయమై సరైన సమయంలో కేంద్రం జోక్యం చేసుకుంటుందని భావిస్తున్నానని అన్నారు. అమరావతి విషయంలో న్యాయ, రాజ్యాంగపరంగా ముందుకెళ్తామని, అభివృద్ధి పేరుతో కాలయాపన తప్ప జగన్ చేసేదేమీ లేదని విమర్శించారు.