telugu navyamedia
క్రీడలు

ఏఫ్రాంఛైజీ…. ఎవరిని అంటి పెట్టుకుంది ..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో క్రికెటర్లను అంటిపెట్టుకున్న ఫ్రాంచైజీలు…. కొత్త ఆటగాళ్ల కొనుగోలుకు… వేలంపాటకోసం ఎదురుచూస్తున్నాయి. చెన్నైసూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్, ఫ్రాంచైజీలు నలుగురు ఆటగాళ్లను తమవద్దే ఉంచుకున్నట్లు ప్రకటించాయి.

రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీలు ముగ్గు ఆటగాళ్ల చొప్పున అంటిపెట్టుకున్నాయి. పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీమాత్రం ఇద్దరిని అంటిపెట్టుకున్నామని పేర్కొంది.

ఐపీఎల్ 2022 సీజన్ వేలంపాటలో ఆటగాళ్లను కొనుగోలుచేసుకోడానికి ఫ్రాంచైజీలు ఎదురుచూస్తున్నాయి. పంజాబ్ కింగ్స్ వద్ద రూ.72 కోట్లు, సన్ రైజర్స్ వద్ద రూ.68 కోట్లు, రాజస్థాన్ రాయల్స్ చేతిలో రూ62 కోట్లు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వద్ద రూ.57 కోట్లు, చెన్నై సూపర్ కింగ్స్ రూ.48 కోట్లు, కోల్కతా నైట్ రైడర్స్ రూ. 48 కోట్లు, ముంబై ఇండియన్స్ రూ. 48 కోట్లు, ఢిల్లీ క్యాపిటల్స్ రూ.47 కోట్ల 50 లక్షలను చేతిలో ఉంచుకున్నట్లు అపెక్స్ కౌన్సిల్ కు ప్రతిపాదనలు పంపారు.

చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు : రవీంద్ర జడేజా రూ. 16కోట్లు, మహేంద్రసింగ్ ధోనీ రూ.12 కోట్లు, మొయిన్ అలీ రూ.8కోట్లు, రుతురాజ్ గైక్వాడ్ రూ.6 కోట్లు

ముంబయి ఇండియన్స్ అంటిపెట్టుకున్న ఆటగాళ్లు : రోహిత్ శర్మ రూ.16 కోట్లు, జస్ప్రీత్ బుమ్రా రూ.12కోట్లు, సూర్యకుమార్ యాదవ్ రూ.8 కోట్లు, కీరన్ పొల్లార్డ్ రూ. 6కోట్లు

ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద ఉంచుకున్న ఆటగాళ్లు : రిషబ్ పంత్ రూ.16 కోట్లు, అక్షర్ పటేల్ రూ.9 కోట్లు, పృధ్విషా రూ.7కోట్ల 50 లక్షలు, అన్రిచ్ నోర్జ్ రూ.6కోట్ల 50 లక్షలు

కోల్కతా నైట్ రైడర్స్ వద్ద ఉన్న క్రికెటర్లు : ఆండ్రీ రస్సెల్ రూ.12 కోట్లు, వరుణ్ చక్రవర్తి రూ.8 కోట్లు, వెంకటేశ్ అయ్యర్ రూ. 8 కోట్లు, సునీల్ నరైన్ రూ.6 కోట్లు,

రాజస్థాన్ రాయల్స్ : సంజూశాంసన్ రూ. 14 కోట్లు, జోస్ బట్లర్ రూ. 10 కోట్లు, యశస్వి జైశ్వాల్ రూ.4కోట్లు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : విరాట్ కోహ్లీ రూ.15 కోట్లు, గ్లెన్ మ్యాక్స్ వెల్ రూ.11 కోట్లు, మహ్మద్ సిరాజ్ రూ.7 కోట్లు

సన్ రైజర్స్ హైదరాబాద్ : కేన్ విలియమ్సన్ రూ.14 కోట్లు, అబ్ధుల్ సమద్ రూ.4 కోట్లు, ఉమ్రాన్ మాలిక్ రూ.4 కోట్లు

పంజాబ్ కింగ్స్ : మయాంక్ అగర్వాల్ రూ.12 కోట్లు, అర్షదీప్ సింగ్ రూ. 4 కోట్లు

Related posts