టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తన రాజకీయ ప్రవేశం పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతోన్న నేపథ్యంలో.. తన పొలిటికల్ ఎంట్రీపై షాకింగ్ కామెంట్స్ చేశారు దాదా… తన రాజకీయ ప్రవేశం ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలియదు.. కానీ, ఏదైనా అప్పటికప్పుడు జరిగిపోతుందని చెప్పుకొచ్చాడు. దానికి ఉదాహరణగా.. తన జీవితంలో జరిగిన సంఘటనలను ప్రస్తావించారు సౌరవ్ గంగూలీ. తన జీవితంలో రాజకీయాలు ఉంటే అది కూడా జరగుతుందని వ్యాఖ్యానించారు గంగూలీ.. నా జీవితంలో చాలా విషయాలు హఠాత్తుగా జరిగాయి.. సచిన్ కెప్టెన్సీ తీసుకుని ఉంటే నాకు కెప్టెన్సీ వచ్చే అవకాశాలే లేవు.. కానీ, అతడు రిజైన్ చేశాడు. దాంతో తనకు బాధ్యతలు అప్పగించారని గుర్తుచేసుకున్నారు.. ఇక, బీసీసీఐ అధ్యక్షుడి పదవి కూడా అలానే వచ్చిందన్నారు దాదా.. కొన్ని నిమిషాల ముందు వరకు అధ్యక్షుడిని అవుతానని అనుకోలేదు.. అసలు ఆ విషయమే తెలియదు.. అది కూడా అలాగే జరిగిందని.. నా జీవితం ఎప్పుడూ అలానే ఉంటుందని గత సంఘటనలు గుర్తు చేసుకున్నాడు. ఇక, పొలిటికల్ ఎంట్రీపై స్పందిస్తూ.. తనకు రాజకీయ అవకాశాలు వచ్చాయని స్పష్టం చేశాడు దాదా.. కానీ, తానే పక్కన పెడుతూ వస్తున్నానని క్లారిటీ ఇచ్చాడు.
previous post
మోదీ సంస్కరణల వల్లే తెలంగాణలో 24 గంటల విద్యుత్: లక్ష్మణ్