telugu navyamedia
సినిమా వార్తలు

ప్రాణదాత సినిమాకు 30 ఏళ్ళు ..

శ్రీ అనుపమ ప్రొడక్షన్ పతాకంపై డాక్టర్ అక్కినేని నాగేశ్వర రావు , లక్ష్మితో మోహన్ గాంధీ దర్శకత్వంలో రూపొందించిన “ప్రాణదాత “సినిమాకు జనవరి 14తో 30 ఏళ్ళు , ఈ సినిమాను పి .బలరాం , కాట్రగడ్డ ప్రసాద్ నిర్మించారు .

నేను నిర్మించిన సినిమాల్లో ప్రాణదాత కు ఎన్నో ప్రత్యేకతలు వున్నాయి . నా అభిమాన హీరో అక్కినేని నాగేశ్వర రావు గారితో నేను నిర్మించిన మొదటి సినిమా ప్రాణదాత. ఇది పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో నిర్మించాము . మహానటుడు నాగేశ్వర రావు గారు ఎలాంటి ఆడంబరాలు లేకుండా మాతో పాటు గుడ్లవలేరు లాటి పల్లెటూరిలో వున్నారు . క్రమశిక్షణ కు మారు పేరు నాగేశ్వర రావు గారు . ఆయన నుంచి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను . ప్రాణదాత సినిమా ఎన్నో మధుర స్మృతులను మిగిల్చిన దని నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ చెప్పారు .

నాకు చిన్నప్పటి నుంచి అక్కినేని నాగేశ్వర రావు అంటే ఎంతో అభిమానం , పంపిణీదారుగా వున్న నేను సినిమా నిర్మాణంలోకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు . నాగేశ్వర రావు గారితో ప్రాణదాత, కాలేజీ బుల్లోడు రెండు సినిమాలు రూపొందిస్తానని కూడా అనుకోలేదు . ఆ రెండు సినిమాల నిర్మాణం జీవితంలో మర్చిపోలేను అని చెప్పారు ప్రసాద్.

1991లో పరుచూరి బ్రదర్స్ తో కలసి హైదరాబాద్ బంజారా హిల్స్ లో వున్న నాగేశ్వర రావు గారి ఇంటికి వెళ్ళాను . ఆయన కథ వినగానే వెంటనే ఒప్పుకున్నారు . అప్పుడు చెప్పను నేను మీ అభిమానినని , ఆ మాట విని ఆయన ఎంతో సంతోషపడ్డారు బని ప్రసాద్ తెలిపారు .ప్రాణదాత సినిమా 1992 జనవరి 14న విడుదలై ఘనవిజయం సాధించింది అని చెప్పారు ప్రసాద్ .

Related posts