telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పోలీసులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపిన మహేష్ బాబు

Mahesh

కరోనా వైరస్ ఇపుడు మన దేశంతో పాటు ప్రపంచ దేశాలను సైతం వణికిస్తోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా డాక్టర్లు, నర్సులు, పోలీసులు, మీడియా,పారిశుద్ధ కార్మికులు, జల మండలి, విద్యుత్ వంటి అత్యవసర సేవలు మాత్రం నిరంతరాయంగా పనిచేస్తున్నాయి. ఈ సందర్భంగా వారు చేస్తోన్న కృషిని మెచ్చుకుంటూ ప్రధాని మోదీ పిలపు మేరకు ఒకసారి చప్పట్లతో మరోసారి దీపాల వెలుగులతో అత్యవసర సేవలు చేస్తున్న వారికి సంఘీభావం ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విట్టర్ ద్వారా తెలంగాణ పోలీసులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.` కరోనాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో అలుపెరగని పోరాటం చేస్తున్న తెలంగాణ పోలీసులకు హృదయపూర్వక ధన్యవాదాలు. అత్యంత క్లిష్టమైన ఈ సమయంలో మీరు చేస్తున్న కృషి అసాధారణమైనది. ప్రజలు, దేశం పట్ల మీకున్న అంకితభావానికి సెల్యూట్ చేస్తున్నా` అంటూ మహేష్ ట్వీట్ చేశాడు.

Related posts