telugu navyamedia
సినిమా వార్తలు

శ్రీ విద్యానికేతన్ కాలేజ్‏కీ యూనివర్సిటీ హోదా..

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో త‌న‌కంటూ ఓ బ్రాండ్ సంపాదించుకున్న విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు. విలన్‌ పాత్రల నుంచి హీరోగా ఎదిగి ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. కేవలం హీరోగానే కాకుండా నిర్మాతగాను సక్సెస్‌ అయ్యారు

నటుడిగా ఎన్నో పేరు ప్రఖ్యాతలు సాధించిన ఆయన మ‌రోవైపు తిరుపతిలో శ్రీ విద్యా నికేతన్‌ను స్థాపించారు.ఆ తర్వాత‌ విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్, కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజ్, ఫార్మసీ, పీజీ కాలేజ్ ఏర్పాటు చేశారు. విద్యా దాతగా కూడా ఎన్నో మెట్లు ఎక్కారు. రెండున్నర దశాబ్ధాలుగా కులమతాలకు అతీతంగా 25 శాతం రిజర్వేషన్లు ఇచ్చి.. పేదవారికి సాయం చేస్తున్నారు మోహన్ బాబు.

ఇన్నేళ్ల సేవకు గుర్తింపుగా తన విధ్యా సంస్థలకు యూనిర్సిటీ గుర్తింపు వచ్చిందంటూ మోహన్ బాబు.. ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు మోహన్ బాబు. యం.బీ.యూ గా దీనికి నామకరణం చేశారు.

” చిన్న విత్త‌నంగా ప్రారంభమైన శ్రీ విద్యానికేతన్‌ విద్యా సంస్థలు ఇప్పుడు కల్పవృక్షంగా మారాయి. 30 సంవ‌త్స‌రాల‌ మీ నమ్మకం ఇప్పుడు నన్ను అత్యున్న‌త స్ధాయికి చేర్చింది. ఆ కృతజ్ఞతతోనే తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీని స్థాపిస్తున్నాను. మీ ప్రేమే నా బలం. నా ఈ కలకు కూడా మీరు సహకారం అందిస్తారని నమ్ముతున్నాను. నా తల్లిదండ్రులు, అభిమానుల ఆశీస్సులతో నేను ఈ విషయాన్ని వినయపూర్వకంగా ప్రకటిస్తున్నాను’.. అని మోహన్ బాబు ట్వీట్ చేశారు.

Related posts