telugu navyamedia
ఆంధ్ర వార్తలు

పండ‌గ‌పూట ఫ‌లించిన చ‌ర్చ‌లు..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వై.ఎస్‌ జ‌గ‌న్‌తో మెగాస్టార్ చిరంజీవి భేటి ముగిసింది. తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో దాదాపు గంటకు పైగా కొనసాగింది. ఈ సమావేశం త‌రువాత నేరుగా గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడ మీడియా మాట్లాడారు.. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో జ‌రిగిన వ‌న్ టు వ‌న్ స‌మావేశం చాలా సంతృప్తిక‌రంగా, నాకు ఎంతో ఆనంద‌గా ఉంద‌ని అన్నారు.

ఈ పండ‌గ‌పూట ఓ సోద‌రిడిలా ఆయన నన్ను ఆహ్వానించి విందు భోజనం పెట్టడం సంతోషంగా ఉంది. .ఆయ‌న నాతో సంభాషించిన తీరు గాని, నాకు ఆప్యాయ‌తను క‌న‌బ‌రిచే విధానం కాని అత్యంత సంతృప్తినిచ్చింది . ముఖ్యంగా శ్రీమ‌తి భార‌తి గారు ద‌గ్గ‌ర ఉండి భోజ‌నం వ‌డ్డించారు.. వారి ఇద్ద‌రికి నా హృద‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు అని చిరంజీవి అన్నారు..

ఇక గత కొన్ని నెలలుగా నడుస్తున్న విషయంపై ఎంతో మీమాంస ఏర్పడింది. జటిలమైన ఈ సమస్యను ఒక కొలిక్కి తీసుకురావడానికి జగన్ గారు నన్నుఆహ్వానించారు. ఒక నిర్ణయం తీసుకోవడానికి ముందు ఒక సైడ్ మాత్రమే కాదు రెండు సైడ్లు వినాలని, మీరు వస్తే ఒక విధివిదానాన్ని తయారుచేసి .. తుది నిర్ణయం తీసుకోవాలని ఆయన నన్ను కోరడం ఎంతో భాద్యతగా అనిపించింది.

Related posts