ఏపీలో జరిగిన పంచాయితీ ఎన్నికల్లో జనసేన తన ఉనికి చాటుకుంది. పంచాయితీలు చాలా తక్కువగానే వచ్చినప్పటికీ ఓట్ల శాతాన్ని లెక్కగడుతోంది. అధికార పార్టీ, ప్రతిపక్ష టీడీపీ ఉన్నప్పటికీ తొలివిడతలో 18, రెండో విడతలో 22, మూడో విడతలో 23 శాతం ఓట్లు వచ్చాయని చెబుతున్నాయి ఆ పార్టీ శ్రేణులు. ఇక 1500పైన పంచాయితీల్లో జనసేన రెండో స్థానంలో నిలిచిందంటే తమకు పల్లెల్లో ఓటు బ్యాంకు ఉందనేది గుర్తించాలన్నది వారి మాట. ఒకే ఒక్క ఎమ్మెల్యే ప్రాతినిథ్యం ఉన్నప్పటికీ ఈ స్థాయిలో బలం పుంజుకున్నామని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొదటి దశలో 1700 పంచాయతీల్లో, రెండో దశలో 1500 పంచాయితీల్లో, మూడో దశలో 1654 పంచాయితీల్లో రెండో స్థానంలో తమ పార్టీ అభ్యర్థులు నిలిచారని లెక్క కడుతున్నారు జనసేన పార్టీ నేతలు. ఇక జిల్లాల వారీగా చూస్తే ఉభయగోదావరి, విశాఖపట్నం, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాల్లో జనసేన ప్రభావం చూపగలిగింది. అయితే, అన్ని పార్టీలు ఎవరికి వారు లెక్కలు కడుతున్నా… జనసేన మాత్రం ఓట్ల శాతాన్ని తెరపైకి తెస్తోంది. చూడాలి మరి తిరుపతిలో జరిగే ఉప ఎన్నికలో జనసేన పరిస్థితి ఎలా ఉంటుంది అనేది.
previous post
next post
సోమారపు పార్టీనీ వీడటం వల్ల నష్టమేమీ లేదు: ఎమ్మెల్యే బాల్క సుమన్