telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

“వైఎస్సార్‌ నవోదయ” పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్‌

jagan

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి “వైఎస్సార్‌ నవోదయ” పథకాన్ని ప్రారంభించారు. సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. సుమారు 80,000 యూనిట్లు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందనున్నాయి. లక్షల మందికి ఉపాధి కల్పించే ఎంఎస్‌ఎంఈలను ఆదుకునేందుకు సీఎం ఈ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ పథకం కింద ఇబ్బందుల్లో ఉన్న పరిశ్రమల రుణాలను ఒకే విడతలో రీషెడ్యూల్‌ చేస్తారు. ఇందుకు సంబంధించి బ్యాంకులకు ప్రభుత్వం హామీగా ఉంటుంది. ఇబ్బందుల్లో ఉన్న పరిశ్రమలను గుర్తించేందుకు కలెక్టర్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వం కమిటీ కూడా ఏర్పాటు చేసింది. వచ్చే ఏడాది మార్చి 31లోగా ఎంఎస్‌ఎంఈల రుణ ఇబ్బందులు తీర్చేలా బ్యాంకులు సిద్ధం కావాలని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌.వి.సుబ్రహ్మణ్యం, బ్యాంకర్ల ప్రతినిధులు పాల్గొన్నారు.

Related posts