telugu navyamedia
ఆంధ్ర వార్తలు

నగరి ఎమ్మెల్యే రోజాకు ఝలక్..

ఇన్నాళ్లు ఎడమొహం… పెడమొహంగా ఉన్న రాజకీయ వైరం బహిర్గతమైంది. నగరి ఎమ్మెల్యే రోజా స్థానిక సంస్థల ఎన్నికలసమయంలో ఒక వర్గానికే అవకాశం కల్పించారని గొడవలు చోటుచేసుకున్నాయి. తాజాగా ఎమ్మెల్యే రోజాకు క్షేత్రస్థాయి నాయకులు, కార్యకర్తలు నగరి ఎమ్మెల్యేకు షాకిచ్చారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా విభేదాలు పొడజూపాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు రెండు వర్గాలుగా విడిపోయి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలనునిర్వహించారు.
=======
నగరి, పుత్తూరు, ఏకాంబరకుప్పం ప్రాంత పరిసరాల్లో రోడ్లకు ఇరువైపులా జగన్ మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతూ…బ్యానర్లు కట్టారు. అదే మార్గంలో నగరి ఎమ్మెల్యే రోజా వైఎస్ఆర్ కాంగ్రెస్ అభిమానులు, కార్యకర్తలతో పార్టీ జెండాలతో మోటారు సైకిళ్లతో భారీ ప్రదర్శన నిర్వహించారు. అడుగడుగునా… రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటుచేసిన బ్యానర్లలో రోజా ఫోటో లేకుండా ప్రత్యర్థి వర్గం జాగ్రత్తపడింది.


=======
నగిరి నియోజకవర్గంలోని ఏకాంబర కుప్పం నుంచి నగరి ఎమ్మెల్యే ఆర్.కే.రోజా నిర్వహించిన ప్రదర్శనలో సాగినంతదూరం…రోజా ఫోటో లేని బ్యానర్లు కట్టడంతో రోజావర్గీయులు విస్మయానికి గురయ్యారు. ఎమ్మెల్యే రోజా ఫోటో ఎక్కడా లేకపోవడంతో వచ్చే ఎన్నికల్లో క్షేత్రస్థాయి నాయకులు మద్దతు ఇవ్వబోరనే విషయాన్ని జగన్ పుట్టినరోజు సందర్భంగాసంకేతాలు జారీ చేశారు.

నగిరి నియోజకవర్గంలోని నాలుగు మండలాల ముఖ్య నేతలు పుత్తూరులో తమ అభిమాననాయకుడి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించి… ఎమ్మెల్యే రోజాపట్ల అసమ్మతిని వెల్లడించారు. ఒకే పార్టికి చేందిన నాయకులు ఒకే నియోజకవర్గంలో రెండు ప్రాంతాల్లో జగన్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించడం చర్చనీయాంశమైంది.

Related posts