telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఆ గ్రామాలకు త్వరలో .. మొబైల్‌ ఫోన్‌ సర్వీసులు ..

mobile services in those villages also soon

ఏపీలోని తూర్పు కనుమలు విస్తరించి ఉన్న దాదాపు 2,068 గ్రామాలకు మొబైల్‌ ఫోన్‌ సర్వీస్ లను అందుబాటులో లేవని కమ్యూనికేషన్లశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ రాజ్యసభలో వెల్లడించారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. భౌగోళికంగా అనుకూలతలు లేని మారుమూల ప్రాంతాల్లో, అక్కడక్కడ విసిరేసినట్లు ఉండి, వాణిజ్యపరమైన కార్యకలాపాలకు అనువుగా లేని కారణంగానే మొబైల్‌ ఫోన్‌ సర్వీస్ లను విస్తరించలేకపోయినట్లు మంత్రి చెప్పారు.

వామపక్ష తీవ్రవాదాన్ని ఎదుర్కొనే వ్యూహంలో భాగంగా టెలికమ్‌ సేవలు అందిస్తున్న సంస్థలతో కలిసి ఆయా గ్రామాలకు మొబైల్‌ ఫోన్‌ సర్వీస్ లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఇందుకు అనుగుణంగా 346 మొబైల్‌ టవర్స్‌ ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వివరించారు. తూర్పు కనుమలు విస్తరించి ఉన్న 9 జిల్లాల్లో 8,963 గ్రామాలు ఉండగా అందులో 5,967 గ్రామాలకు బీఎస్‌ఎన్‌ఎల్‌ మొబైల్‌ ఫోన్‌ సర్వీసులను అందిస్తోందని వివరించారు.

Related posts