telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“బంగర్రాజు” వచ్చేస్తున్నాడా…!

అక్కినేని నాగార్జున సోగ్గాడే చిన్ని నాయనా సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు. ఆతరువాత అందులోని బంగర్రాజు బ్యాక్ స్టోరీతో సినిమా రానుందని అన్నారు. ఈ చర్చ అప్పటి నుంచి వినిపిస్తూనే ఉంది. ఈ సినిమా స్క్రెప్టు కోసం దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల గత మూడు సంవత్సరాలుగా శ్రమిస్తున్నాడు. కానీ నాగార్జునానే ఓకే చేయట్లేదు. కానీ ఈ సినిమా చేయడం పక్కా, అదీ సొంత బ్యానర్‌లో చేస్తానని నాగ్ అనేక సార్లు అన్నాడు. ఈ సినిమా మాటల రూపంలోనే తప్ప కార్యరూపంలో మాత్రం ముందుకు వెళ్లడం లేదు. బంగార్రాజుకు స్క్రిప్టు పూర్తయిందని, చిత్రీకరణ మొదలు పెట్టడమే తరువాయి అన్న వార్తలు ఎన్నో సార్లు వచ్చినీ ప్రతి సారీ ఎదో ఒక కారణంతో బ్రేక్ పడింది. దాంతో అభిమానులకు కూడా ఈ సినిమాపై ఆసక్తి సన్నగిల్లింది. సినిమా మొదలైతే చూద్దాం అనుకునే స్థాయికి వెళ్లింది. అయితే ఈ సినిమా ఎట్టకేలకు వచ్చే ఏడాది సంక్రాంతి తరువాత పట్టాలెక్కుతుందని వార్తలు వస్తున్నాయి. నాగార్జునా సినిమాకు కావలసిన స్క్రిప్ట్ ఓకే చేశాడని అంటున్నారు. ఇటీవల నాగార్జునా తన నూతన చిత్రం ‘వైల్డ్ డాగ్’ను, రియాలటీ షో బిగ్ బాస్‌ను ముగించుకొని ఫ్రీ అయ్యాడు. ఇక ఈ సినిమాను మొదలు పెట్టడమే తరువాతయి అని సమాచారం. ఈ సినిమాలో రమ్యకృష్ణ కూడా ఉంటుందని, ఓ కీలక పాత్రలో నాగచైతన్య కనిపించే అవకాశాలు ఉన్నాయని టాక్ నడుస్తోంది. బంగార్రాజు సినిమాకు కూడా అనూప్ రూబెన్స్ సంగీతం అందించనున్నాడట. మరి ఈ సినిమాపై ఇప్పుడొస్తున్న వార్తలు ఎంతవరకు కార్య రూపం దాలుస్తాయో చూడాలి.

Related posts