రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఒకవైపు బిజినెస్ రంగంలో దూసుకెళ్తోనే, భార్యగా రామ్ చరణ్ కు సంబంధించిన అన్ని వ్యవహారాలను చూసుకుంటుంది. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ గా ఉంటూ నెటిజన్లతో సరదాగా ముచ్చటిస్తారు. తాజాగా కెరీర్ పరంగా తన అత్తామామలు సురేఖ, చిరంజీవి ఎంతో ప్రోత్సాహిస్తారని కథానాయకుడు రామ్ చరణ్ సతీమణి ఉపాసన అన్నారు. ఆమె చీఫ్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్న ‘బీ పాజిటివ్’ మ్యాగజైన్ కవర్ పేజీలో ఇటీవల మెగాస్టార్ చిరు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మ్యాగజైన్ కోసం ఉపాసన తన మామయ్య చిరు ఇంటర్వ్యూ కూడా తీసుకున్నారు. ఫొటోలో చిరు యంగ్‌లుక్‌లో కనిపించారు. కాగా ఉపాసన ఆదివారం చిరు, సురేఖ ఫొటోలను సోషల్‌మీడియాలో షేర్ చేశారు. అందులో చిరు తన కవర్ పేజీతో వచ్చిన మ్యాగజైన్‌ను చదువుతుండగా.. సురేఖ కిట్‌ను పరిశీలిస్తూ కనిపించారు. ‘నా ఉత్తమ బ్రాండ్ అంబాసిడర్స్. నా కెరీర్‌కు సపోర్ట్ చేస్తూ, వర్క్ పరంగా ప్రోత్సహించే అత్తామామలు ఉండటం నిజంగా నా అదృష్టం. మా అత్తామామలు ప్రతి కుటుంబానికి స్ఫూర్తిదాయకం. నేను వారి కోడలు కావడం గర్వంగా ఉంది’ అని ఉపాసన ట్వీట్ చేశారు.
My best brand ambassadors ❤️Really blessed to have in laws that support me in my career & encourage me to work. Athama & Mamaya are a true inspiration to every family. Proud to be their daughter in law. 🙏🏼. @Apollo_LStudio #megastarchiranjeevi #megastarforever pic.twitter.com/pi1huVUcGx
— Upasana Konidela (@upasanakonidela) 11 August 2019
జగన్ ను సపోర్ట్ చేసినందుకు ఆ నిర్మాత సినిమాలోంచి తీసేశారు… : పోసాని