ప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు కన్నుమూశారు. ఆయన వయసు 80 సంవత్సరాలు. చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 250కి పైగా చిత్రాలలో నటించిన గొల్లపూడి విజయనగరంలో జన్మించారు. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చిత్రంతో నటుడిగా సినీ రంగ ప్రవేశం చేశారు. ఆయన మృతి టాలీవుడ్ పరిశ్రమకి తీరని లోటు. గొల్లపూడి ఆత్మకి శాంతి కలగాలని సినీ ప్రముఖులు ప్రార్ధిస్తున్నారు. మారుతీరావును ఒక్క భారతదేశంలోనే కాకుండా వివిధ దేశాల్లో అనేక బిరుదులు, సన్మానాలు వరించాయి. ఉత్తమ కథా రచయితగా, స్క్రీన్ ప్లే రచయితగా, సంభాషణల రచయితగా, నటుడిగా ఐదు సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది అవార్డును అందుకున్నాడు. అంతే కాకుండా నాటకాల్లో ఆయనకు పలు పురస్కారాలు లభించాయి.
బహు కళాప్రపూర్ణుడు గొల్లపూడి మారుతీరావు విలక్షణ నటుడు, ప్రతి నాయకుడు, రచయిత, కవి, జర్నలిస్టు, ప్రసంగీకుడు. ఇలా పలు రంగాల్లో రాణించిన గొల్లపూడి మారుతీరావుకు ఐదు సార్లు నంది అవార్డులు వరించాయి. గొల్లపూడి నాలుగు సార్లు నంది అవార్డులు అందుకున్నారు. 1963లో డాక్టర్ చక్రవర్తి సినిమాకు ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయిగా, 1965లో ఆత్మగౌరవం అనే సినిమాకి ఉత్తమ రచయితగా, 1989లో కళ్ళు అనే రచన సినిమాగా వచ్చింది. దీనికి ఉత్తమ రచయితగా, 1991లో మాస్టారి కాపురం సినిమాకు గానూ ఉత్తమ సంభాషణల రచయితగా నంది అవార్డులు అందుకున్నారు గొల్లపూడి. అప్పాజోశ్యుల విష్ణుభట్ల ఫౌండేషన్ జీవన సాఫల్య అవార్డు, గురజాడ అప్పారావు, పురస్కారం, పులికంటి కృష్ణా రెడ్డి పురస్కారం, ఆత్రేయ స్మారక పురస్కారం, రాజ్యలక్ష్మి అవార్డు, సాహిత్య అకాడమీ అవార్డు, వంశీ బర్కిలీ అవార్డు, శ్రీ పాద సుబ్రహ్మణ్య శాస్త్రి అవార్డు, కొండముది శ్రీరామ చంద్రమూర్తి అవార్డు, లోక్‌నాయక్ ఫౌండేషన్ అవార్డు ఇలా ఎన్నో అవార్డులు పొందారు గొల్లపూడి. ఇంతటి బహుముఖ ప్రజ్ఞాశాలి కన్నుమూయడంతో సినీ ప్రముఖులు, సాహితీవేత్తలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.