ఎంఐఎం, బీజేపీ పార్టీలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇవాళ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ని కలిసిన పీసీసీ చీఫ్ ఉత్తమ్, అంజన్ కుమార్ యాదవ్ కలిశారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా ఎన్నికలను జరపాలని…ప్రభుత్వ ఆస్తులు..సంస్థలపై trs విచ్చల విడిగా ప్రచారం చేసుకుంటుందన్నారు. మెట్రో పిల్లర్లపై trs వేసుకున్న ప్రచారం హోర్డింగ్ల పై అభ్యన్తంతరం చెప్పామని… Rtc షెల్టర్స్ పై కూడా ప్రకటనలు వేశారని తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆఫీస్ ముందున్న బస్ షెల్టర్ మీద కూడా trs ప్రకటనలు వేశారని… మరి ఏం చూస్తున్నారో అర్థం కాలేదని ఫైర్ అయ్యారు. అన్ని ప్రాంతాల్లో అధికార పార్టీ ప్రకటనలు మాత్రమే వేసుకోవడం సరికాదన్నారు. బీజేపీ గ్రేటర్ ఎన్నికల్లో నిస్సిగ్గుగా వ్యవహరిస్తోందని… కాంగ్రెస్ నాయకుల ఇండ్లకు డబ్బుల సంచులు తెచ్చి ప్రలోభ పెడుతున్నారని ఫైర్ అయ్యారు. బీజేపీ… కేంద్రం నుండి డబ్బులు తెచ్చి రాజకీయం చేస్తున్నదని…. బీజేపీ సిగ్గులేకుండా వ్యవహరిస్తోందన్నారు. మోడీ ప్రభుత్వం హైదరాబాద్ కి రావాల్సిన itir ప్రాజెక్ట్ రద్దు చేయలేదా అని ప్రశ్నించారు. బీజేపీ..ఎంఐఎం కి రహస్య ఒప్పందం ఉందని..బీహార్ లో బీజేపీని గెలిపించడానికే mim పోటీ చేసిందన్నారు. MIm లేకుంటే.. బీహార్ లో కాంగ్రెస్ అధికారంలో కి వచ్చేదని తెలిపారు. బండి సంజయ్… మాది మతతత్వ పార్టీ అని ఒప్పుకున్నారని… బీజేపీ.. mim రెండు మతతత్వ పార్టీలన్నారు.
previous post