telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

హైదారాబాద్‌ : … మరింత వేగంగా .. ఎంఎంటీఎస్‌ రైళ్లు..

few mmts cancelled today due to maintenance

ఎంఎంటీఎస్‌ రైళ్ల వేగం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. క్షణాల్లో వేగాన్ని అందుకునే శక్తి వీటి సొంతం. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎంఎంటీఎస్‌ రైళ్ల వేగం ఇంకా ఎక్కువగా ఉంది. పాత ఎంఎంటీఎస్‌ రైళ్ల ఇంజిన్‌కు ఒక అశ్వసామర్థ్యం(హార్స్‌ పవర్‌) వేగం ఉంటే.. కొత్తగా వచ్చిన రైళ్లకు మూడు అశ్వ సామర్థ్యం వేగం ఉందని రైల్వే ఉన్నతాధికారులు తెలిపారు. ఈ వేగమే కాచిగూడ స్టేషన్‌లో సోమవారం ప్రమాదానికి కారణమైందని చెప్పవచ్చు. సోమవారం జరిగిన రైలు ప్రమాదంలో హంద్రీ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ ఇంజిన్‌ మాత్రమే ప్రధాన లైను నుంచి కాచిగూడలోని నాలుగో ప్లాట్‌ఫాం మీదకు తిరిగింది.

ఈ ఇంజిన్‌ను ఎంఎంటీఎస్‌ రైలు ఢీకొట్టడంతో పెను ప్రమాదం తప్పింది. ఇదే వేగంతో హంద్రీ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైలు బోగీలను ఢీకొంటే పెను ప్రమాదం సంభవించేదని ఘటనాస్థలిని పరిశీలించిన రైల్వే ఉన్నతాధికారులు ‘ఈనాడు’తో చెప్పారు. హంద్రీ ఎక్స్‌ప్రెస్‌కు డీజిల్‌ ఇంజిన్‌ ముందు ఉంది. దీనిని ఢీకొట్టడంతో వెనుక ఉన్న బోగీలు రైలు పట్టాల నుంచి పక్కకు జరిగాయి కాని.. అవి కిందపడడం కాని..నుజ్జునుజ్జు అవ్వడం జరగలేదు.

Related posts