telugu navyamedia
సినిమా వార్తలు

బాలీవుడ్ హీరో ఎఫైర్ బయటపెట్టిన రాధికా ఆప్టే

Radhika-Apte

సినిమా ఇండస్ట్రీలో డేటింగ్ అనేది సర్వసాధారణం. ముఖ్యంగా బాలీవుడ్ లో సెలెబ్రిటీల మధ్య డేటింగ్, బ్రేకప్ లు జరుగుతూనే ఉంటాయి. తాజాగా “యూరి” సినిమాతో హీరోగా క్రేజ్ సంపాదించుకున్న విక్కీ కౌశల్ మలయాళ నటి మాళవిక మోహనన్ తో ప్రేమలో ఉన్నాడనే విషయం తెలిసింది. మలయాళీ ఇండస్ట్రీకి చెందిన మాళవిక ప్రస్తుతం విజయ్ దేవరొండ నటిస్తోన్న “హీరో” సినిమాలో నటిస్తోంది. మాళవిక పరిచయమైనప్పుడే “యూరి” సినిమా పెద్ద సక్సెస్ కావడంతో ఆమెని లక్కీగా ఫీలవుతున్నాడట ఈ యంగ్ హీరో. ఇప్పుడు ఈ బ్యూటీతో విక్కీ కౌశల్ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాడు. దాదాపు ఆరేడు నెలలుగా వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారు. అయితే ఇప్పటివరకూ ఈ విషయం బయటకి రాలేదు. తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్న నటి రాధికాఆప్టే వీరి వ్యవహారాన్ని బయటపెట్టింది. రాధికా ఆప్టే సోదరుడు మాళవికకు బాగా క్లోజ్ అట. దీంతో విక్కీ-మాళవిక ఎఫైర్ గురించి తనకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తుంటాయని చెప్పుకొచ్చింది రాధికా ఆప్టే. ఇకనైనా విక్కీ, మాళవిక తన ఎఫైర్ ను పబ్లిక్ గా ఒప్పుకోవాలని, అప్పుడే పుకార్లు రాకుండా ఉంటాయని ఉచిత సలహాలు కూడా ఇచ్చింది రాధికా.

Related posts