telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఎంఐఎం, టీఆర్‌ఎస్‌ను తెలంగాణ నుంచే పంపేద్దాం

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు  బండి సంజయ్ మరో సారి టీఆర్‌ఎస్‌, ఎంఐఎంలపై విరుచుకుపడ్డారు. మార్పు కోసం హైదరాబాద్‌ అనే నినాదంతో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టింది బీజేపీ. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ… మార్పు కోసం జనం… జనం కోసం బీజేపీ ఉందని..  అధికార పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టిన దుబ్బాక గడ్డమీద కాషాయ జెండా ఎగుర వేశామని పేర్కొన్నారు.  అక్కడి ప్రజలు.. గ్రేటర్ లో అన్ని సర్వేలో బీజేపీకి అనుకూలంగా వస్తున్నాయని.. టీఆర్‌ఎస్‌ కు గుండెల్లో గుబులు పట్టుకుంది  అందుకే చిల్లర రాజకీయాలు చేస్తోందని ఫైర్‌ అయ్యారు.   99 మంది టీఆర్‌ఎస్‌ కార్పోరేటర్ లను గెలిపించినా… కనీస అవసరాలు కల్పించలేదన్నారు. రాక రాక ఒక ఉద్యోగ నోటిఫికేషన్ వస్తే..  టీఆర్‌ఎస్‌ నేతలే కోర్ట్ కి వెళ్లి స్టే  లు తీసుకొచ్చారని మండిపడ్డారు. పేదోళ్లు ఇండ్లు కట్టుకోక పోయినా, కరోనాతో ఇబ్బందుల్లో ఉన్న కేసీఆర్ మాత్రం కనిపించడని ఫైర్‌ అయ్యారు.  రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రతి పనిలో కేంద్రం వాటా ఉందని…  ఒక్క ఛాన్స్ ఇవ్వండి అభివృద్ధి చూపిస్తామని హామీ ఇచ్చారు.  నా సంతకం ఫోర్జరీ చేసి, సవాలు విసిరితే రాలేక పోయారని… దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలన్నారు.  భాగ్యలక్ష్మి దేవాలయం  పాకిస్థాన్ లో ఉందా… కావాలిస్తే ఆ దేవాలయం వద్దే అడ్డ పెడతానని హెచ్చరించారు.  ముఖ్యమంత్రి పై MIM కామెంట్ లు కావాలనే చేశారని చెప్పారు.  దమ్ముంటే MIM పార్టీ తో పొత్తు లేదంటే.. మీ అభ్యర్థుల తరపున ఓల్డ్ సిటీ లో ప్రచారానికి వెళ్ళాలని సవాల్‌ విసిరారు.  ఈ ఎన్నికల్లో MIM,TRS లను రింగ్ రోడ్డు నుంచి బయటకు పంపుదామని.. 2023 లో తెలంగాణ నుండి పంపేద్దామని తెలిపారు.

Related posts