telugu navyamedia
రాజకీయ

యూపీలో ప‌ర్య‌ట‌న – కాశీ కి చేరుకున్న మోదీ. ..

ఉత్తరప్రదేశ్‌లోని ‘కాశీ విశ్వనాథ్‌ కారిడార్‌ ప్రాజెక్టు’ ను సోమవారం ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. కాశీ విశ్వనాథ్‌ ఆలయాన్ని గంగా ఘాట్లతో ఈ ప్రాజెక్టు అనుసంధానం చేస్తుంది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి దివ్యకాశీ-భవ్యకాశీగా నామకరణం చేశారు.

వారణాసిలో పర్యాటక రంగాన్ని పెద్దఎత్తున పెంచేందుకు ఉద్దేశించి మెగా ప్రాజెక్ట్ దాదాపు 800 కోట్ల వ్యయంతో కాశీ విశ్వనాథ్ కారిడార్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.

From Kashi Vishwanath Dham to Rudraksh Convention Centre: Here's How PM Modi  Transformed Varanasi

సోమవారం ఉదయం వారణాసి విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీ, ఆ తర్వాత కాలభైరవ ఆలయాన్ని సందర్శించారు. అనంత‌రం కాశీ విశ్వనాథ్ ధామ్‌కు వెళ్లనున్నారు, అక్కడ కారిడార్‌ను ప్రారంభించనున్నారు. ముందుగా లలితా ఘాట్‌ను సందర్శించి, అక్కడి నుంచి కాశీ విశ్వనాథ ఆలయానికి వెళ్తారు.

కాశీ విశ్వనాథ్ ధామ్ కారిడార్‌కు ప్రధాని మోదీ మార్చి 8, 2019న శంకుస్థాపన చేశారు. ఇది 5 లక్షల చదరపు అడుగుల భారీ విస్తీర్ణంలో విస్తరించి ఉంది. భక్తులకు వివిధ సౌకర్యాలు కల్పించేందుకు 23 కొత్త భవనాలను నిర్మించారు.

PM Modi offers prayers at Kashi Vishwanath Temple, takes tour of corridor  project - The Statesman

మోదీ పర్యటన కోసం న‌గరం లో ఆలయాలు, వీధులన్నింటినీ విద్యుత్‌ దీపాలతో సుందరంగా అలంకరించారు. 2019లో ఈ కారిడార్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. స్థానికుల నుంచి భూసేకరణ జరిపి, మొత్తం ఐదు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కారిడార్‌ను పూర్తి చేశారు. అలాగే 40 పురాతన ఆలయాలను పునరుద్ధరించి, సుందరీకరించారు.

సోమవారం ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ అగ్రనేతలకు ఆహ్వానం పంపారు. కార్యక్రమానికి 3వేల మంది సాధువులు, ప్రముఖులు, ఆధ్యాత్మిక వేత్తలకు యూపీ సర్కారు ప్రత్యేకంగా ఆహ్వానం పంపింది. దేశ వ్యాప్తంగా దివ్యకాశీ-భవ్యకాశీని 51వేల చోట్ల ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.

యూపీ ఎన్నికలకు….

మ‌రి కొద్ది రోజుల్లో ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ప్రధాని మోదీ వరసగా ఆ రాష్ట్ర పర్యటనలకే ఎక్కువ ప్రాధాన్యత సంత‌రించుకుంటుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని వరస శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Related posts