telugu navyamedia
రాజకీయ విద్యా వార్తలు

విద్యా పరిరక్షణ ఉద్యమం

ఆగస్టు 16 ,2020 న వర్చువల్ పద్ధతిలో తెలంగాణ రాష్ట్రమంతటా నిర్వహించబడిన “”విద్యా పరిరక్షణ ఉద్యమం “”కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కృతజ్ఞతాభివందనములు.

అన్ని రంగాలను ఆదుకుంటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని మాత్రం విస్మరించాయి. ముఖ్యంగా ప్రైవేట్ విద్యా వ్యవస్థను అణిచివేయలని చూస్తున్నాయి. TRSMA మరియు NISA నాయకులు అనేక విధాలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నవించినా ప్రైవేట్ విద్యా సంస్థలు ప్రభుత్వంలో భాగం కానట్టుగా పక్షపాత ధోరణితో ప్రభుత్వ వర్గాలు ప్రవర్తిస్తున్నాయి.
ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని ఆమోదించి,. 2022-23 నుండి అన్ని రాష్ట్రాలలో నూతన విద్యావిధానాన్ని అమలు చేయాలని చూస్తున్న సమయంలో దీనిపై చాలామంది విద్యాసంస్థల యాజమాన్యాలకు అవగాహన లేకపోవడం, ఈ విద్యా విధానం వల్ల ప్రైవేట్ విద్యా సంస్థలకు లాభం చేకూరుతుందా, నష్టం వాటిల్లుతుందా తెలియని పరిస్థితులలో , ప్రభుత్వాలు సమకాలీన సమాజంలో విద్యా ప్రాముఖ్యతను తగ్గించే ఆలోచనలతో ఉన్నది అనే భయాందోళన మధ్య మన రాష్ట్ర సంఘం ట్రస్మా మరియు మన జాతీయ సంఘమైన నిసా(National Independent Schools Alliance) సంయుక్తంగా పాఠశాల నిర్వాహకులకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మరియు సమాజంలో ఉన్న ముఖ్య వ్యక్తులకు విషయ అవగాహన కల్పించుటకు, వ్యవస్థ పరిరక్షణ కొరకు విద్యా పరిరక్షణ ఉద్యమం చేపట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని TRSMA విద్యా పరిరక్షణ ఉద్యమం లో ఈ డిమాండ్లను చేస్తున్నది

“ప్రతి విద్యార్ధి కి విద్యా రుసుము ప్రభుత్వమే ఇవ్వాలి “.

” ప్రతి విద్యార్థికి 30,000/- ప్రభుత్వాలే నేరుగా విద్యార్థుల పాఠశాల బ్యాంక్ ఎకౌంట్లో జమ చేయాలి “అని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.

“ఉచిత విద్య ప్రతి విద్యార్ధి హక్కు ” అది కల్పించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే కనుక నాణ్యమైన విద్యా బోధనకు ప్రభుత్వ ప్రైవేటు సంస్థలకు సమాన అవకాశాలు కల్పించాలి”. కానీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.

” కొవిడ్-19 కారణంగా ఆర్థికంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు ప్రైవేటు ఉపాధ్యాయులను పాఠశాలలు పునః ప్రారంభం అయ్యేంతవరకు ప్రభుత్వం తక్షణమే జీతాలు చెల్లించి ఆర్థికంగా ఆదుకోవాలని, విద్యాధికులైన ఉపాధ్యాయుల గౌరవమర్యాదలు కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.”

” ప్రైవేటు విద్యా సంస్థలను కాపాడుకొని కోవిడ్ అనంతరం లక్షలాది మంది నిరుద్యోగులుగా మారకుండా ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం”.

“Covid 2019 కారణంగా దెబ్బతిన్న అనేక రంగాలను వివిధ మార్గాలలో ఆదుకున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటు విద్యా సంస్థలను చిన్న చూపు చూశాయి. కనీసం ఇప్పటికైనా విద్యా సంస్థలు, వారి ఉపాధ్యాయుల ఇబ్బందులను గుర్తించి ఆదుకోవాలి” అని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.

“ప్రైవేటు విద్యాసంస్థలను కూడా MSME సెక్టార్ కింద గుర్తించి, పరిశ్రమ వర్గాలకు అందిస్తున్న రాయితీలను, వడ్డీలేని రుణాలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం”.

” COVID లాంటి కష్ట సమయాలలో విద్యా సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బందిని ఆదుకునేందుకు ఒక సంస్థను ఏర్పాటు చేసి ఒక ప్రత్యేక గ్రాంట్ ను విడుదల చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
**

వివిధ సోషల్ మీడియా మాధ్యమాలు అయిన ఫేస్బుక్, యూట్యూబ్ , మరియు ఫోన్ ద్వారా సుమారు ఒక లక్ష ఇరవై వేల పైచిలుకు విద్యార్థులు తల్లిదండ్రులు విద్యావేత్తలు సామాజిక వేత్తలు తో పాటు 6,800 పైచిలుకు విద్యాసంస్థల యాజమాన్యాలు పాల్గొన్న ఈ NEP 2020 చర్చా గోష్టి & సేవ్ బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్ ఉద్యమ కార్యక్రమంలో పాల్గొన్న లోక్ సత్తా వ్యవస్థాపకులు శ్రీ జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు అందరూ విద్యా అభివృద్ధికై ఆలోచించాలని , ప్రభుత్వ ప్రభుత్వ ప్రైవేటు అనే తారతమ్యాలు లేకుండా నాణ్యమైన విద్య చిన్నారులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని , విద్యార్థులకు అవసరమైన ఆర్థిక సహాయం ప్రభుత్వాలు అందించి అక్షరాస్యత శాతాన్ని పెంచి దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంచాలని ఆయన ఆకాంక్షించారు. ఈ మహాయజ్ఞంలో తన వంతు సహాయం ఎల్లప్పుడూ విద్యాసంస్థలకు ఉంటుందని, విద్యాఅభివృద్ధికై పోరాడుతున్న అనేక ఉత్తమమైన విద్యా సంస్థలు ప్రైవేటు రంగంలో ఉన్నాయని, TRSMA తో కలిసి నడవడానికి తాను సిద్ధమని ఆయన తెలియజేశారు . 20వ శతాబ్దానికి బహువిధాల ఉపయోగపడే నూతన విద్యా విధానo, NEP 2020 ద్వారా విద్యా సంస్థ అనుసరించాలని ఆయన ఆకాంక్షించారు.

పూర్వపు అడిషనల్ డీజీపీ ప్రముఖ వక్త శ్రీ వి.వి లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థలలో ఉత్తమమైనవి అనేకం ఉన్నాయని,గతంలో ఎన్నో కమిషన్లు విద్యాభివృద్ధికి ఏర్పడడం జరిగినప్పటికీ అవి సత్ఫలితాలు సాధించలేక పోయినప్పటికీ ఇది సరైన తరుణం కనుక NEP ద్వారా 20వ శతాబ్దపు విద్యతో విద్యార్థులను నిష్ణాతులుగా తయారు చేయవచ్చని, అవసరమైన శిక్షణా తరగతులు నిర్వహించి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కూడా నూతన విద్యా విధానానికి అనుగుణంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న NISA జాతీయ అధ్యక్షులు కులభూషన్ శర్మ మాట్లాడుతూ ప్రైవేటు విద్యా సంస్థలు దేశ భవిష్యత్తు కొరకు అహర్నిశలు శ్రమిస్తున్నాయని నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించే దిశగా ప్రతినిత్యం పాటుపడుతూ ఎప్పటికప్పుడు తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని ,సామర్థ్యాన్ని పెంచుకుంటూ విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో TRSMA గౌరవ అధ్యక్షులు శ్రీ ఎస్ శ్రీనివాస్ రెడ్డి, సలహాదారులు ఐ వి రమణ రావు , డాక్టర్ J.S. పరంజ్యోతి, Dr E.ప్రసాదరావు తదితర ప్రముఖ వక్తలు రంగ పరిరక్షణకు మరియు నూతన విద్యా విధానం అమలుకు అవసరమైన మార్పులపై తమ అమూల్యమైన సలహాలను అందించారు.

తెలంగాణ రాష్ట్ర గుర్తింపు పొందిన సంఘం రాష్ట్ర బాధ్యులు శ్రీ యాదగిరి శేఖర్ రావు ఎస్ మధుసూదన్ పి నాగేశ్వరరావు గార్లు ఈ కార్యక్రమ విజయవంతానికి కృషి చేసిన మీడియా మిత్రులకు విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులకు మిత్రులకు శ్రేయోభిలాషులకు విద్యా వ్యక్తులకు పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ధన్యవాదములతో
ఇట్లు

యాదగిరి శేఖర్ రావు
రాష్ట్ర అధ్యక్షులు

సాదుల మధుసూదన్
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

P. నాగేశ్వర రావు
రాష్ట్ర కోశాధికారి
ట్రస్మా, తెలంగాణ రాష్ట్రం

Related posts