telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

ఏపీ లో కౌంటింగ్‌ కేంద్రాలను ప్రకటించిన ఈసీ

dvivedi on poling percentage and evm rumours
ఆంధ్ర ప్రదేశ్  లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన సంగతి తెలిసిందే. ఇక మే 23న జరిగే ఓట్ల లెక్కింపు కోసం  25 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో కౌంటింగ్‌ కేంద్రాలను ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్లను లెక్కించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 
అరకు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్లను శ్రీకాకుళంలోని శ్రీ శివాని ఇంజనీరింగ్‌ కాలేజీ, విజయనగరంలోని ఎంవీజీఆర్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ, విశాఖపట్నంలోని ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజీ, తూర్పు గోదావరిలోని ఆదికవి నన్నయ యూనివర్సిటీలో లెక్కిస్తారు.
శ్రీకాకుళం:  శ్రీకాకుళంలోని శ్రీ శివాని ఇంజనీరింగ్‌ కాలేజీ.
విజయనగరం: శ్రీకాకుళంలోని శ్రీ శివాని ఇంజనీరింగ్‌ కాలేజీ, విజయనగరంలోని జేఎన్‌టీయూ కే ఇంజనీరింగ్‌ కాలేజీ, లెండీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, పోలిస్‌ ట్రైనింగ్‌ కాలేజీ.
విశాఖపట్నం: విజయనగరంలోని ఎంవీజీఆర్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ, విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ.
అనకాపల్లి: ఆంధ్ర యూనివర్సిటీ
కాకినాడ: కాకినాడ జేఎన్‌టీయూ
అమలాపురం: కాకినాడలోని జిల్లా స్పోర్ట్‌ అథారిటీ, జేఎన్‌టీయూ, రంగరాయ మెడికల్‌ కళాశాల, జేఎన్‌టీయూ ఇండోర్‌ స్టేడియం.
రాజమండ్రి: కాకినాడలోని ఐడియల్‌ ఇంజనీరింగ్‌ కళాశాల, జేఎన్‌టీయూ కాకినాడ, సీఆర్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ.
నరసాపురం: విష్ణు ఎడ్యుకేషనల్‌ సొసైటీ డెంటల్‌, స్కూల్‌, పాలిటెక్నిక్‌ కాలేజీ.
ఏలూరు: ఏలూరులోని రామచంద్ర ఇంజనీరింగ్‌ కాలేజీ, మచిలీపట్నం కృష్ణా యూనివర్సిటీ.
మచిలీపట్నం: మచిలీపట్నంలోని కృష్ణా యూనివర్సిటీ.
విజయవాడ: విజయవాడలోని ధనేకుల ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ.
బాపట్ల: పర్చూరు, అద్దంకి, చీరాల, ఎస్‌ఎన్‌పాడు నియోజకవర్గాల ఓట్లను వల్లూరు మండలంలోని పేస్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ భవనంలో.., వేమూరు, రేపల్లె, బాపట్ల నియోజకవర్గాల ఓట్లను నాగార్జున యూనివర్సిటీలో లెక్కిస్తారు.
ఒంగోలు: రైజ్‌ కృష్ణసాయి గాంధీ గ్రూప్‌నకు చెందిన విద్యా భవనాలు.
నంద్యాల: రాయలసీమ యూనివర్సిటీ.
కర్నూలు: పుల్లయ్య ఇంజనీరింగ్‌ కాలేజీ, రవీంద్ర ఇంజనీరింగ్‌ కాలేజీ.
అనంతపురం: జేఎన్‌టీయూ ఇంజనీరింగ్‌ కాలేజీ.
హిందూపురం: ఎస్‌కేయూలో…
కడప: కేఎల్‌ఎం ఇంజనీరింగ్‌ కాలేజీ
నెల్లూరు: రైజ్‌ కృష్ణసాయి పాలిటెక్నిక్‌ కాలేజీ, నెల్లూరులోని డీకే గవర్నమెంట్‌ కాలేజీ.
తిరుపతి: నెల్లూరులోని ప్రియదర్శిని ఇంజనీరింగ్‌ కాలేజీ, పూతలపట్టులోని శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్‌ కాలేజీ, ఆర్‌కేఎం లా కాలేజీ
రాజంపేట: కడపలోని కేఎల్‌ఎం ఇంజనీరింగ్‌ కాలేజీ, పూతలపట్టులోని శ్రీవెంకటేశ్వర ఇంజనీరింగ్‌ కళాశాల.
చిత్తూరు: శ్రీ శ్రీనివాస ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌ భవనం.
గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ.
నరసరావుపేట: నల్లపాడులోని లయోలా పబ్లిక్‌ స్కూల్‌లో లెక్కించనున్నారు.

Related posts