telugu navyamedia
ఆంధ్ర వార్తలు

రాష్ట్రం కోసం అవసరాన్ని బట్టి పొత్తుల నిర్ణయం ఉంటుంది..

*పొత్తులపై ప్ర‌చారంపై స్పందించిన చంద్ర‌బాబు

రాష్ట్రం కోసం అవసరాన్ని బట్టి పొత్తుల నిర్ణయం ఉంటుంది..
*నేను మార‌తాను.. మీరు మారాలి..
*ఇక‌పై ఏ ఎన్నిక వ‌చ్చినా పోటీ చేసి గెల‌వాల్సిందే..
* పొత్తులు గురించి నేను ఎక్క‌డా మాట్లాడ‌లేదు..
*ధైర్యంగా ముందడుగు వేస్తేనే భవిష్యత్‌- పార్టీ నేత‌ల‌కుకు చంద్రబాబు క్లాస్

పొత్తులపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి క్లారిటీ ఇచ్చారు. కేంద్రంలో, రాష్ట్రంలో కానీ రాష్ట్ర పునర్ణిర్మానం చేసే కార్యక్రమాలకే ప్రధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు.

తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో చంద్ర‌బాబు కీలక వ్యాఖ్యలు చేశారు..వచ్చే ఎన్నికలలో రాష్ట్రం కోసం అవసరాన్ని బట్టి పొత్తుల నిర్ణయం ఉంటుందని ఆయన అన్నారు. సమయానుకూలంగా పొత్తులపై నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు.

ఇప్పటి వరకూ పొత్తుల గురించి తానెక్కడా మాట్లాడలేదని… నాయకుల్లోనూ ఈ స్పష్టత ఉండాలని తెలిపారు.
ఏదైనా ఇప్పుడే దానిపై ఆలోచించేందుకు సమయం కాదని, ముందు ముందు దీనిపై తానే స్పష్గత ఇస్తానని చంద్రబాబు తెలిపారు.

ఇకపై ఏ ఎన్నిక వచ్చినా పోటీ చేసి గెలవాల్సిందే అని చంద్రబాబు పార్టీ నేతలకు చంద్రబాబు పిలుపు నిచ్చారు. పార్టీ శ్రేణులు నిరంతరం ప్రజల్లో ఉంటూ వారికోసం పనిచేసి నమ్మకం పెంచాలని ఆదేశించారు.మన పోరాటం పార్టీతో పాటు అన్ని వర్గాల ప్రజల కోసమని అన్నారు.

పార్టీకి సంబంధించి గ్రామ స్థాయి వరకు కమిటీలు నియమించాలన్నారు. ఓటర్ల వెరిఫికేషన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు. లేకపోతే టీడీపీ వాళ్ల ఓట్లు ఉండవని హెచ్చరించారు. ప్రజల్లో ఎంత చైతన్యం ఉన్నా ఓట్లు లేకపోతే ఏమీ చెయ్యలేమన్నారు.

వీటన్నింటినీ టీడీపీ నేతలు సవాల్‌గా తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు చంద్రబాబు. నేతలు తమ సౌకర్యం కోసం ఇంట్లో పడుకుంటే ఎన్నికల అనంతరం కూడా ఇంట్లో ఉండాల్సి వస్తుందని హెచ్చరించారు.

రాష్ట్రంలో ఇంత అరాచకం ఉంటే కొన్ని టీవీలు తిరిగి టీడీపీనే విమర్శిస్తున్నాయని ఆశ్చర్య వ్యక్తం చేశారు చంద్రబాబు. వాటిని దూరంగా పెట్టాలని పిలుపునిచ్చారు.

ఎన్నికలకు 18 నెలల సమయం ఉందన్న చంద్రబాబు… జగన్ ఇంకా ముందు ఎన్నికలకు వెళ్తే రాష్ట్రానికి పట్టిన దరిద్రం పోతుందన్నారు. ఇప్పుడు ఎక్కడా పొత్తుల గురించి మాట్లాడడం లేదని… పార్టీలో కూడా ఈ విషయంలో క్లారిటీ ఉండాలన్నారు.

Related posts