telugu navyamedia
రాజకీయ

పన్నీరు సెల్వంకు షాకిచ్చిన‌ హైకోర్టు.. అన్నాడీఎంకే పగ్గాలు పళనిస్వామికే..

*మ‌ద్రాసు హైకోర్టులో ఈపీఎస్‌కు ఊర‌ట‌..
*అన్నాడీఎంకే పార్టీ తాత్కాలిక జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీగా పళనస్వామి ఈపీఎస్ చెల్లుతుంద‌న్న హైకోర్టు
*పిటిష‌న్‌ను విచారించిన హైకోర్టు
 సింగిల్ బెంచ్‌పై స్టే ఇస్తూ ఉత్త‌ర్వులు

మాజీ ముఖ్యమంత్రి అన్నాడీఎంకే నేత పన్నీర్‌సెల్వంకు మద్రాస్ హైకోర్టులో చుక్కెదురయింది. అన్నాడీఎంకే నాయకత్వం విషయంలో పళనిస్వామికి అనుకూలంగా మద్రాస్ హైకోర్టు తీర్పు చెప్పింది. అన్నాడీఎంకే తాత్కాలిక జనరల్‌ సెక్రటరీగా పళనస్వామి కొనసాగవచ్చని ఇద్దరు సభ్యుల ధర్మాసనం తీర్పునిచ్చింది.

ఈ ఏడాది జులై 11వ తేదీన జరిగిన ఏఐఏడీఎంకే జనర్ కౌన్సిల్ సమావేశం చెల్లదంటూ సింగిల్‌బెంచ్‌ ఇచ్చిన ఇచ్చిన ఉత్తర్వులను ఉత్తర్వులను పక్కన పెట్టింది.. ఈ క్రమంలో జూన్ 23న జరిగిన సమావేశం చట్టవిరుద్ధమని పేర్కొంటూ యథాతథ స్థితిని కొనసాగించాలని ఇరువర్గాలను ఆదేశించింది .దీంతో అన్నాడీఎంకే పళనిస్వామి నాయకత్వంలోనే కొనసాగనుంది.

జులై 11న జరిగిన పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో అన్నాడీఎంకే తాత్కాలిక సెక్రటరీగా పళనిస్వామి ఎన్నికయ్యారు. అ యితే దీన్ని సవాల్‌ చేస్తూ ఓ పన్నీర్‌సెల్వం కోర్టును ఆశ్రయించారు. పార్టీలో ఏకపక్షంగా నిర్ణయం జరిగిందని, తమ సభ్యులకు ప్రవేశం లేకుండానే సమావేశాన్ని ముగించారని ఆయన పిటీషన్ దాఖలు చేశారు . అప్పటి సింగిల్ బెంచ్ ధర్మాసనం పళనిస్వామి ఎన్నిక చెల్లదని పన్నీర్‌సెల్వంకు అనుకూలంగా తీర్పునిచ్చింది. 

అయితే  దీనిని సవాల్‌ చేస్తూ పళనిస్వామి ద్విసభ్య ధర్మాసనాన్ని ఆశ్రయించారు. దీంతో విచారణ జరిపిన డివిజన్‌ బెంచ్‌.. ఆయనకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. కోర్టు తీర్పు అనుకూలంగా రావడంతో పళనిస్వామి వర్గీయులు సంబరాలు చేసుకుంటున్నారు.

మరోవైపు కోర్టు తీర్పు అనంతరం అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం వద్ద పోలీసులు పటిష్ఠ భద్రత ఎర్పాటు చేశారు. గతంలో ఈపీఎస్, ఓపీఎస్ వర్గాలు ఆపీస్‌లో విధ్వంసం సృష్టించిన విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈమేరకు చర్యలు తీసుకున్నారు.

Related posts