telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

తిరుమల భక్తులకు షాక్ ..

Tirumala

ఏపీలో ప్రతి రోజు రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే ఏపీలో 9.42 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 7,224 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,55,455 కు చేరింది. ఇందులో 9,07,598 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా 35,907 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా 15 మంది మృతి చెందారు.  తిరుమల శ్రీవారి ఆలయానికి కరోనా ఎఫెక్ట్ పడింది. కరోనా కేసులు పెరుగుతూ వుండడంతో దర్శనాల సంఖ్య తగ్గించింది టిటిడి. అలిపిరి వద్ద ప్రతి రోజూ జారీ చేసే 20 వేల సర్వదర్శనం టోకేన్లను నిలిపివేసింది టిటిడి. ఆన్ లైన్ లో నిత్యం 30 వేల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విక్రయించినా …భక్తులు నుంచి స్పందన తగ్గింది. పరిస్థితిని బట్టి దర్శన టికెట్ల సంఖ్యను తగ్గించే యోచనలో ఉంది టిటిడి. ఇప్పటికే పురావస్తు శాఖ ఆదేశాల మేరకు టిటిడి ఆధ్వర్యంలోని ఒంటిమిట్ట, శ్రీనివాస మంగాపురం ఆలయాలను మూసివేసింది టిటిడి.

Related posts