అక్రమ మద్యం తరలిస్తూ ఓ బీజేపీ నేత పోలీసులకు పట్టుబడడం చర్చనీయాంశంగా మారింది. చిట్యాల నుంచి గుంటూరుకు మద్యం తరలిస్తున్న గుడివాక రామాంజనేయులు అనే బీజేపీ నేతను పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు ఏఈఎస్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో రూ.6 లక్షల విలువైన 1,920 మద్యం సీసాలు, 3 కార్లు స్వాధీనం చేసుకున్నారు.
ఈ వ్యవహారంలో గుడివాక రామాంజనేయులుతో పాటు మచ్చా సురేశ్, కె.నరేశ్ అనే వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో గుడివాక రామాంజనేయులును ఏ-1గా పేర్కొన్నారు. రామాంజనేయులు 2019లో మచిలీపట్నం ఎంపీ స్థానంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు.
బోస్టన్ గ్రూప్ కమిటీపై ఎఫ్బీఐ కేసులు: టీడీపీ నేత అనురాధ