telugu navyamedia
రాజకీయ వార్తలు

30 రోజుల్లో చర్యలు తీసుకోవాలి.. డబ్ల్యూహెచ్‌వోకు ట్రంప్ వార్నింగ్!

trump in america president election race

చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)కు ఇప్పటికే నిధులు ఆపేసిన సంగతి తెలిసిందే. తాజాగా డబ్ల్యూహెచ్‌వోకు అమెరికా మరో హెచ్చరిక చేసింది. తాజాగా డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రెయెసుస్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఓ కీలక లేఖ రాశారు.వచ్చే 30 రోజుల్లో గణనీయమైన చర్యలు తీసుకోవాలని, లేదంటే నిధులను శాశ్వతంగా నిలిపేస్తామని హెచ్చరించారు. అంతేకాకుండా సంస్థ సభ్యత్వాన్ని కూడా తమ దేశం వదులుకుంటుందని తెలిపారు.

కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో ప్రపంచాన్ని తప్పుదారి పట్టించే విధంగా డబ్ల్యూహెచ్‌వో ప్రకటనలు చేసిందని ట్రంప్ గుర్తు చేశారు. మనిషినుంచి మనిషికి కరోనా సోకదని చైనా పరిశోధనలో వెల్లడైనట్లు గతంలో డబ్ల్యూహెచ్‌వో ప్రకటిందని, అయితే, ఆ తర్వాత ప్రకటించిన నివేదిక మరోలా ఉందని ఆయన పేర్కొన్నారు.కరోనా గురించి మాట్లాడిన వైద్యులపై దాడులు జరుగుతున్నప్పటికీ చైనా పారదర్శకంగానే వ్యవహరిస్తోందంటూ డబ్ల్యూహెచ్‌వో వ్యాఖ్యలు చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు.

Related posts