telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ ను యూఏఈ లో అందుకే నిర్వహిస్తున్నాం : జై షా

ఐపీఎల్‌ 2021 సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. అయితే ఏ తేదీల్లో నిర్వహిస్తామనే విషయంపై పూర్తి స్పష్టత రాలేదు. సెప్టెంబర్‌ 18 నుంచి అక్టోబర్‌ 12 మధ్య లీగ్‌ జరగవచ్చని బోర్డు వర్గాల సమాచారం. 2021 ఐపీఎల్‌లో 29 మ్యాచ్‌లు నిర్వహించిన అనంతరం అనూహ్యంగా ఆటగాళ్లకు కరోనా సోకడంతో తప్పనిసరి పరిస్థితుల్లో లీగ్‌ను వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ప్లే ఆఫ్స్‌ సహా లీగ్‌లో మరో 31 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. అయితే లీగ్‌ను యూఏఈకి తరలించడానికి కరోనా వైరస్ కారణం కాదని బీసీసీఐ సెక్రటరీ జై షా స్పష్టం చేశారు. సెప్టెంబర్-అక్టోబర్ మధ్యలో భారత్‌లో వర్షాలు పడే అవకాశం ఉందని, వాతవరణ సమ్యసల వల్లే దుబాయ్​కు తరలించినట్లు వెల్లడించాడు. ‘సెప్టెంబరులో భారీగా వర్షాలు పడే అవకాశమున్నందున ఐపీఎల్​ను ఇక్కడ నిర్వహించడం కష్టంగా ఉంటుంది. అందుకే యూఏఈలో జరపాలని నిర్ణయించాం” అని జై షా పేర్కొన్నారు.

Related posts