telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కరోనా వేళ విద్యుత్ చార్జీలు పెంచడం దారుణం: కన్నా

Kanna laxminarayana

కరోనా సమయంలో విద్యుత్ చార్జీలు పెంచడం దారుణమని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. కరోనా కారణంగా ప్రజలందరూ ఎంతో ఇబ్బందిపడుతున్నారని అన్నారు. ఇలాంటి లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలందరూ ఇళ్లలో ఉన్న సమయంలో విద్యుత్ శ్లాబులు మార్చడం దుర్మార్గం అని పేర్కొన్నారు.

ప్రజల పట్ల చిత్తశుద్ధి లేని ప్రభుత్వం అని విమర్శించారు. సహజంగానే ప్రజలు ఇళ్లలో ఉంటే విద్యుత్ వాడకం పెరుగుతుందని, కానీ గతంలో కంటే రెండు, మూడు రెట్లు అధికంగా బిల్లులు రావడం ఆమోదయోగ్యం కాదని అన్నారు. మార్చి నెలలో తాను రూ.11 వేల మేర విద్యుత్ బిల్లు చెల్లించానని, ఈ నెలలో బిల్లు రూ.20 వేలు దాటిందని వెల్లడించారు. ఇది విద్యుత్ చార్జీలు పెంచడం కాక మరేమిటి? అని ప్రశ్నించారు. ఎంతో తెలివిగా విద్యుత్ శ్లాబులు మార్చిన ప్రభుత్వం చార్జీలు మాత్రం పెంచలేదని చెప్పడంపై కన్నా మండిపడ్డారు.

Related posts