telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

విద్యుత్ టారిఫ్ పెంచారు.. ఏపీ సర్కారుపై పురందేశ్వరి ధ్వజం!

daggubatipurandeswari

ఏపీ ప్రభుత్వంపై బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి ధ్వజమెత్తారు. సీఎం జగన్ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. విద్యుత్ స్లాబ్ రేటును 75 యూనిట్లకు తగ్గించడం, విద్యుత్ టారిఫ్ ను పెంచడం వంటి నిర్ణయాలతో పేదలపై తీవ్రమైన ఆర్థిక భారం పడుతోందని అన్నారు.

ఆదాయం కోసం దేవాదాయ భూములను, ప్రభుత్వ భూములను అమ్ముతున్నారని ఆరోపించారు. వేలమంది బీజేపీ కార్యకర్తలు వైసీపీకి, సీఎం జగన్ కు వ్యతిరేకంగా నిరసన గళం వినిపిస్తున్నారంటూ పురందేశ్వరి ట్వీట్ చేశారు.

Related posts