telugu navyamedia
రాజకీయ వార్తలు

పొరుగు దేశాల వివాదంపై పారదర్శకత పాటించాలి: రాహుల్‌

Rahul gandhi congress

చైనా, నేపాల్ లాంటి పొరుగు దేశాలతో తలెత్తిన వివాదంపై పారదర్శకత పాటించాలని కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ అన్నారు. అప్పుడే అందరికీ నిజాలు తెలుసుకునే అవకాశం లభిస్తుందని రాహుల్ పేర్కొన్నారు. మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రాహుల్‌ మాట్లాడుతూ దేశ సరిహద్దుల్లో చోటుచేసుకుంటున్న పరిణామాల గురించి ప్రజలకు చెప్సాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనే ఉందన్నారు.

‘వాస్త‌వం చెప్పాలంటే, స‌రిహ‌ద్దుల్లో ఏం జరుగుతున్న‌దో ఎవరికీ తెలియదు. ఆ పరిణామాలపై వేర్వేరు కథ‌నాలు వింటున్నాం. వాస్తవాలు తెలియకుండా మనం ఏమీ మాట్లడలేం. స‌రిహ‌ద్దుల్లో ఏం జ‌రుగుతుందో ప్ర‌జ‌ల‌కు తెలియజేయాల్సిన బాధ్యత కేంద్ర‌ ప్రభుత్వానిదే. చైనా, నేపాల్ దేశాల‌తో వివాదంలో పారదర్శకత పాటించాల్సిన అవ‌సరం ఉన్నా ఆ దిశగా ప్రయత్నాలు జరగడం లేదు’ అని రాహుల్‌ పేర్కొన్నారు.

Related posts